Mahashivratri: శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం 

Read Time:  1 min
Mahashivratri: శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం 
FONT SIZE
GET APP

Mahashivratri: ప్రభుత్వాలు మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ప్రత్యేకంగా పోలీస్ టీంలను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయినా చాప కింద నీరులా మత్తు పదార్థాలు సరఫరా, వినియోగం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు.

మహాశివరాత్రి భక్తికి నిదర్శనం ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన తాజాగా కొందరు యువకులు శివరాత్రి రోజు గంజాయితో వికృత చేష్టలకు పాల్పడ్డారు. శివయ్యకు గంజాయిని ప్రసాదంగా పెడుతున్నామంటూ ఇన్‌స్టాల్ రీల్ పోస్టు చేశారు. అందరూ కొబ్బరికాయలు కొడితే శివుడికి ఫేవరెట్ ఉండాలని కొత్త ప్రసాదం పెడుతున్నామంటూ గంజాయిని చూపించారు.

Read Also: TG Municipality Election: లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

Mahashivratri: శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం 
Mahashivratri: Sajjanar is angry over offering intoxicants in the name of prasad to Shiva

సోషల్ మీడియాను సృజనాత్మక వేదికగా ఉపయోగించాలి అని హెచ్చరిక

ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చూసిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అది వికృతమైన ఉన్మాదమని ఫేమస్ కోసం ఇలా తెగిచటం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా? అస్సలు కాదు ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.

క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి అని సజ్జనార్ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.