📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mahabubnagar: నదిలో ‘తోడేళ్ల రోడ్డు!

Author Icon By Tejaswini Y
Updated: March 6, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mahabubnagar : అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మాత్రం మారినట్లు తెలుస్తున్నది. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా నదిలోకే రోడ్డు వేశారంటే అక్రమార్కులు ఎంతకు తెగించారో ఇట్టే తెలుసుకోవచ్చు. కృష్ణా నదిలో అక్రమార్కులు ఇసుకను అర్ధరాత్రి యదేచ్చగా తోడేస్తున్నారు. నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం ముడుమాల్, టైరోడ్, వాసునగర్, గుర్జల్ గ్రామాలలో ఆక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అర్ధరాత్రి హిటాచిల ద్వారా టిప్పర్లకు ఇసుకను నింపి కర్ణాటక రాష్ట్రం, సైదాపూర్, యాదగిరి, గుల్బర్గా వరకు తరలిస్తున్నారు.

Read Also: Praja Palana – Pragati Pranalika : నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

Mahabubnagar: ‘Wolf’s Road’ in the river!

ఒక్కో టిప్పర్ కు ఇరవై వేల నుండి నలభై వేల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. కృష్ణా నదిలో ఇసుక తీసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకపోవడంతో అక్రమార్కుల వ్యాపారం లాభసాటిగా నడుస్తుంది. అర్ధరాత్రి బ్లాక్ దందా జీరోలో నడప డంతో రీచ్ ఓనర్లకు కాసుల పంట పండుతుంది. అధిక లాభా లకు అలవాటు పడ్డ ఓనర్లు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లను వారి గుప్పెట్లో పెట్టుకుని అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలను ఆపాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇసుక అక్రమార్కులు అందరి అధికారులను, రెవెన్యూ పోలీసు శాఖను సైతం మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. మనల్ని ఎవరు ఆపేది అంటూ నదిలో ఇసుక అమ్ముకొని భారీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో అక్రమార్కులు ఏకంగా నదిలోనే రోడ్డు వేశారు.

డ్యూటీలో ఉంటే అక్రమ ఇసుక

ఇసుకాసురులకు ఎవరు ఏదీ అడ్డు కాదని అర్థమవుతుంది. కృష్ణ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తున్నా తమకు పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. ఇదే విషయమై అధికారులను వివరణ కోరగా తహసిల్దార్ శ్రీనివాసులు జిపిఓ, వీఆర్ఎలకు రీచ్ ల దగ్గర డ్యూటీలు వేసినట్లు చెబుతున్నారు. కానీ అక్కడ వారి సిబ్బంది డ్యూటీలో ఉంటే అక్రమ ఇసుక ఎలా రవాణా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందిని పకడ్బందీగా రీచుల దగ్గర డ్యూటీలు వేసి, పర్యవేక్షణ ఉంచి నదిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమాలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకోవలసిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 22న ఇసుక రీచ్ ల దగ్గర ఉన్న ఐదు హిటాచిలను కృష్ణ ఎమ్మార్వో సీజ్ చేశారు. ఒక్కో హిటాచికి ప్రభుత్వ జీవో ప్రకారం 50 వేల జరిమానా మొదటిసారి వేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ అమోంటు జరిమానవేసి వదిలేసినట్లు సమాచారం.

అక్రమార్కులకు తక్కువ జరిమానవేసి వదిలివేయడం వారికి అధికారులు సహకరించినట్లేనని ప్రజలు విమర్శిస్తున్నారు. కృష్ణానది నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఒక టిప్పర్, ఐదు ట్రాక్టర్లను సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసులను పిలిపించుకుని పట్టుబడ్డ వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. విశ్వసనీయ సమాచారం టైరాడ్ అని చెప్పడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. కృష్ణ మండలం గుర్జల్ గ్రామ శివారులోని సిద్ధ లింగేశ్వర మఠం దగ్గర నది నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపు చేసి రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా కర్ణాటక కు దర్జాగా తరలిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాలని సంబంధిత రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

illegal sand mining Krishna River Mahabubnagar News Narayanpet District Sand smuggling

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.