📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Mahabubnagar: గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

Author Icon By Sushmitha
Updated: November 14, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా కేంద్రంలోని పాత తోట వద్ద ప్రమాదవశాత్తు ఇద్దరు కూలీలు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో, పాత తోట ప్రాంతంలో ఒక పురాతన భవనాన్ని తొలగించే ప్రయత్నంలో ఒక్కసారిగా భవనం నేలమట్టం అయింది. ఈ ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మరణించారు. భవన యజమాని లక్ష్మణ్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే పాత భవనాన్ని తొలగించే ప్రయత్నం చేయడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Bihar Elections: మహాఘట్ బంధన్‌ను వెనక్కి లాగుతున్న కాంగ్రెస్

Mahabubnagar

సహాయక చర్యలు, ప్రముఖుల పరామర్శ

ప్రమాదం జరిగిన వెంటనే మున్సిపల్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫలితం దక్కలేదు. దురదృష్టవశాత్తు ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఓనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కలెక్టర్ పరిశీలన, అధికారులకు ఆదేశాలు

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సహాయక చర్యల్లో అదనపు ఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి కిషోర్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

building collapse construction workers death Google News in Telugu Latest News in Telugu Mahabubnagar tragedy police investigation. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.