📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Mahabubnagar District: బాబోయ్ కర్రీపఫ్‌లో పాము పిల్ల.. ఆపై ఏం జరిగింది?

Author Icon By Anusha
Updated: August 13, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది. ఎంత పెద్ద పేరు గాంచిన హోటల్, రెస్టారెంట్ అయినా లోపల పరిస్థితులు, ఆహార నాణ్యత మాత్రం దారుణంగా ఉన్నట్లు తేలిపోతోంది. తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్ (Curry puff) తిందామనుకున్న ఓ మహిళకు వాంతికి వచ్చినంత పనైంది. కర్రీ పఫ్‌లో నాన్ వెజ్.. అది కూడా పాము పిల్ల రావడం చూసి షాక్‌కు గురయ్యింది సదరు మహిళ. ఆ వివరాలు..ఈ దారుణమైన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టౌన్‌లో వెలుగు చూసింది. ఓ మహిళ బేకరీకి వెళ్లి కర్రీపఫ్ తీసుకుని తింటుండగా, సడెన్‌గా అందులో పాము పిల్ల ప్రత్యక్షమైంది. దీంతో ఆమెకు ఒక్కసారిగా గుండాగినంత పనైంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల టౌన్‌ (Jadcharla Town, Mahabubnagar District) కు చెందిన శ్రీశైలమ్మ అనే మహిళ మంగళవారం సాయంత్రం స్థానికంగా కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న అయ్యంగార్ బేకరీకి వెళ్లింది. ఒక కర్రీపఫ్ ఆర్డర్ చేసింది. దాన్ని పార్శిల్ తీసుకుని ఇంటికి వెళ్లింది.

పైగా వెంటనే షాపు మూసివేసి అక్కడ నుంచి జారుకున్నాడు

ఇంటికి చేరుకున్న తర్వాత శ్రీశైలమ్మ తాను పార్శిల్ తెచ్చుకున్న కర్రీపఫ్‌ను ఒపెన్ చేసి తింటుండగా, దానిలో అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. డౌట్ వచ్చి, కర్రీపఫ్ పూర్తిగా తెరిచి చూడగా, పాము పిల్ల కనిపించడంతో ఆమె షాక్‌కు గురయ్యింది. దీని గురించి చుట్టుపక్కల వారికి చెప్పి, వారిని తీసుకుని బేకరీకి వెళ్లింది. కర్రీపఫ్‌లో పాముపిల్ల రావడం గురించి బేకరీ యజమానిని ప్రశ్నించింది. అతడు సరైన సమాధానం చెప్పలేదు. పైగా వెంటనే షాపు మూసివేసి అక్కడ నుంచి జారుకున్నాడు.దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. కర్రీ పఫ్ బదులు ఎగ్ పఫ్ ఆర్డర్ చేసుంటే ఇలా జరిగి ఉండేది కాదు, వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ వచ్చింది.. ఇంకేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కర్రీపఫ్ తినడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పరిశుభ్రంగా తయారైనదా, తాజా పదార్థాలు వాడారా, సరిగా ఉడికిందా అన్నది చూసుకోవాలి.

కర్రీపఫ్‌లో సాధారణంగా ఏ పూర్ణం వాడతారు?

బంగాళదుంప, కూరగాయలు, చికెన్, మటన్ లేదా గుడ్డు పూర్ణం వాడుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/manchu-lakshmi-manchu-lakshmi-appears-before-the-court-in-the-betting-apps-case/crime/529717/

Breaking News cockroaches food safety inspection hyderabad restaurants kitchen flies latest news pista house rats rusty fridge synthetic colors in food Telugu News unhygienic conditions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.