Mahabubabad Well Accident: తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ మండలం బలరాం తండాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులను కలిచివేశాయి.
Read Also: Medak: ఫించన్ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు
బలరాం తండాకు చెందిన కేలోత్ మదన్ (40) తన రెండేళ్ల కుమారుడు జశ్వంత్తో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చిన్నారి జశ్వంత్ ప్రమాదవశాత్తు బావిలో జారిపడినట్లు తెలుస్తోంది. కుమారుడిని రక్షించాలనే ఆతురతతో తండ్రి మదన్ ఎలాంటి ఆలోచన లేకుండా బావిలోకి దూకాడు. అయితే బావిలో లోతు ఎక్కువగా ఉండటం, నీటి మట్టం అధికంగా ఉండటంతో ఇద్దరూ బయటకు రావలేకపోయారు.
సమాచారం అందుకున్న తండావాసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో తండ్రి మదన్ మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. అయితే చిన్నారి జశ్వంత్ మృతదేహం కోసం ఇంకా బావిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో బలరాం తండాలో(Mahabubabad Well Accident) విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తండ్రి మృతి ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: