Mahabubabad News: తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పుతూ, విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న క్రమంలోనే ఓ ఉపాధ్యాయుడు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. వేమునూరు శివారులోని ఉత్తర తండా ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
Read Also: Gadwal Fire Accident: గద్వాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
కుప్పకూలిన గురువు.. కళ్ల ముందే కన్నుమూత
ఉపాధ్యాయుడు శంకర్ ఎప్పటిలాగే శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని సహచర ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: