- MLA Yennam Srinivas Reddy: జర్నలిస్టుల సంక్షేమానికి నేను సైతం అంటూ ఎమ్మెల్యే యెన్నం ముందగుడు
- రూ. లక్ష చెక్కు అందజేత జర్నలిస్టుల సంక్షేమానికి తొలి అడుగు పడింది. అందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదిక అయింది. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమానికి నేను సైతం అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందడుగు వేశారు. ఇప్పటికే చెప్పిన విధంగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి రూ. లక్ష చెక్కును గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా జర్నలిస్టుల సంక్షేమంలో అందజేశారు.
Read Also: Mehdipatnam Skywalk Height Issue: మెహిదీపట్నం స్కైవాక్ ఎత్తుపై విమర్శలు
పాలమూరు జర్నలిస్టుల హర్షం
మాట ఇచ్చిన వారంలోపే ఆచరణలో చూపించి జర్నలిస్టుల పట్ల తనకు ఉన్న అభిమానాన్ని ఆప్యాయతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి వర్కింగ్ జర్నలిస్టును, అన్ని విభాగాల వారీగా సమీక్షించి అందరినీ కలుపుకొని, పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. యూనియన్లు, సంఘాలు భేషాజాలకు వెళ్లకుండా ప్రతీ జర్నలిస్టు సంక్షేమానికి సంఘం కృషి చేయాలని పేర్కొన్నారు. విధివిధానాలను పకడ్బందీగా రూపొందించి ఆపదలో ఉన్న జర్నలిస్టులను కాపాడుకోవాలని వారికి అండగా నిలవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: