📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gas ekyc: గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ రద్దు !

Author Icon By Vanipushpa
Updated: July 27, 2026 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gas ekyc : చాలా ప్రభుత్వ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హులను ఏరియాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు సంస్కరణాలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ కేవైసీ తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. అర్హులైన గ్యాస్ వినియోగదారులను గుర్తించడంతో పాటు అర్హత లేని వారిని తొలగించేందుకు ఈ కేవైసీ ప్రక్రియ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి చాలా మంది కస్టమర్లు ఈకేవైసీ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వినియోగదారుల నుంచి సరైనా స్పందన రాలేదు. దీంతో కంపెనీలు త్వరలోనే నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఈ కేవైసీ చేసుకోని వారికి గ్యాస్​ సరఫరా ఆగిపోయే అవకాశం ఉంటుందని డీలర్స్ హెచ్చరిస్తున్నారు.

Read Also: Public Examination Amendment Bill: పేపర్ లీక్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష

Gas ekyc

Gas ekyc : డిమాండ్ ​కు సరిపడా గ్యాస్ సరఫరా లేదు

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లక్షల కనెక్షన్లుండగా 70 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నట్లు డీలర్లు చెబుతున్నారు. మరోపక్క డిమాండ్ ​కు సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కొన్ని కంపెనీలు ఈ కేవైసీ సాకుతో సిలిండర్ల డెలివరీ నిలిపివేసే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2024 జూన్​ లో వినియోగదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయిల్​ కంపెనీలు తెలిపాయి. ఇందుకు సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నిరంతర ప్రక్రియ పేరుతో దీన్నీ కొనసాగిస్తున్నారు. అయినా వినియోగదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. 2014లోనూ ఈకేవైసీ మొదలుపెట్టి ఐదు సంవత్సరాల పాటు కొనసాగించారు. ఈసారి మాత్రం సంవత్సరాల ముగించేలా ఉన్నారని డీలర్లు అంచనా వేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bharat Gas eKYC status Google News in Telugu HP Gas eKYC process Indane gas eKYC online latest india news LPG gas connection update LPG Gas eKYC mandatory Telugu News Today Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.