వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం సంచలనం రేపుతోంది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న అనుమానంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. భూమార్గం, వాయుమార్గం, జలమార్గం అనే తేడా లేకుండా అన్ని మార్గాల్లోనూ ఆయన కదలికలపై గట్టి నిఘా ఉంచాలని స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు
కొడాలి నానిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని కేసుల్లో తీవ్రమైన నేరాలుగా పరిగణించే సెక్షన్లను ఉపయోగించారని, నేరం రుజువైతే ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ ప్రక్రియలో ఆయన నుంచి సహకారం అందకపోవచ్చని, విదేశాలకు పారిపోయే యత్నం చేసే అవకాశముందని అనుమానంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సాధారణంగా ఇటువంటి పత్యర్థితులపై లుకౌట్ నోటీసులు (Lookout notices) జారీ చేయడం అరుదు కాదు.
అధికారులకు ప్రత్యేక ఆదేశాలు
లుకౌట్ నోటీసుల జారీతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దుల వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆయన విదేశాలకు ప్రయాణించేందుకు యత్నించిన ప్రతిసారి సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించగా, అవసరమైతే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. విపక్షాలు ఈ అంశాన్ని నిలదీయగా, వైసీపీ శ్రేణులు మాత్రం అధికారిక ప్రకటనలు వెలువడేవరకు స్పందించేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
Read Also : Pakistan : పాక్ విమానాలకు మరో నెల నో ఎంట్రీ