📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Local Elections : విలీన గ్రామాలకు స్థానిక ఎన్నికలు లేనట్టే

Author Icon By Shravan
Updated: July 31, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాల ప్రజలకు ఎన్నికలు (Local Elections) లేనట్టే. ఈ గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామాల ఓటర్లు ఇకపై మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే, ఈ విలీనం కార ణంగా ఉపాధి హామీ పథకానికి వీరు దూరం కానుండటంతో ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి.. నోటిఫికేషన్ విడుదల చేయడమే మిగిలింది. తెలంగాణ హైకో ర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ఓ మండలంలో ఉన్న 18 గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే అని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సి పాలిటీలో విలీనంచేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇందుకు 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవర ణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ (Telangana governer) జిష్ణు దేవవర్మ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆ 18 గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించనున్నారు. అలానే ఈ గ్రామాల ఓటర్లను మున్సిపాలిటీలో కలపను న్నారు. దీంతో ఈ 18 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే అని చెబుతున్నారు. తెలంగాణ కేబినెట్ రాష్ట్రంలో కొత్తగా రెండు మున్సిపాలి టీలను ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసింది. జిన్నారం, ఇంద్రేశంలను మున్సి పాలిటీలుగా ప్రక టించింది. ఈక్రమంలో వీటి పరిధిలోని అనగా పటాన్ చెరువులో 8, జిన్నారంలో 10 గ్రామాలను కొత్త మున్సిపాలిటీలో విలీనం చేసింది ప్రభుత్వం.  ఈ నిర్ణయం వల్ల ఎంపీటీసీ స్థానాలతో పాటుగా ఒక ఎంపీపీ స్థానం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లు ఈ 18 గ్రామాల ఓటర్లు స్థానిక సంస్థల ఎలక్షన్లో పాల్గొని ఓట్లు వేశారు. తాజా నిర్ణ యంతో వీరంతా ఇక నుంచి మున్సిపాలిటీ ఎన్ని కల్లో తమ ఓటు హక్కు వినియోగిం చుకోను న్నారు. త్వరలో పంచాయతీరాజ్ శాఖ ఎంపీటీ సీల డీలిమిటేషన్ షెడ్యూల్కు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది. దీనిపై అభ్యం తరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించనున్నారు. ఉపాధి హామీ పథ కానికి దూరం ఈ 18గ్రా మాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆ గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పథకానికి దూరం కానున్నారు. ఈ గ్రామాలు మున్సిపాలిటీల్లో కలవడం వల్ల ఇక నుంచి ఈ గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం వర్తించదు. గ్రామస్తులు ఈ అంశంపై స్పందిస్తూ ప్రభుత్వమే తమకు ఏదో ఒక ఉపాధి కల్పించేలా చూడాలని వేడుకుంటున్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 3 మురికి వాడల వాసుల అంగీకారం

Breaking News in Telugu Google News in Telugu Gram Panchayat Latest News in Telugu Local elections merged villages

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.