📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC Scam: నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో కోట్లు దండుకున్న దంపతులు

Author Icon By Saritha
Updated: March 4, 2026 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

LIC Scam: భద్రాచలం పట్టణంలో సినీ ఫక్కీలో జరిగిన ఒక భారీ ఇన్సూరెన్స్ మోసం కలకలం రేపుతోంది. ఎల్ఐసీ (LIC) ఏజెంట్లుగా పనిచేస్తున్న ఓ భార్యాభర్తలు అడ్డదారిలో కోట్లు సంపాదించాలనే ఆశతో ఏకంగా బతికున్న వారినే కాగితాల్లో చంపేశారు. నకిలీ పత్రాలతో ఎల్ఐసీ నుంచి కోట్లాది రూపాయల క్లెయిమ్ సొమ్మును కాజేశారు.

Read Also: Central Government: ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ: కేంద్రం నిర్ణయం

LIC Scam: Couple embezzled crores using fake death certificates

నిరుపేదలే లక్ష్యంగా స్కెచ్

నిరుపేదలను ఆసరాగా చేసుకుని ఈ మోసానికి తెరలేపారు. ముందుగా వారి పేరుతో ఎల్ఐసీ పాలసీలు కట్టించి పాలసీదారులు బతికుండగానే, వారు చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఇలా మొత్తం 39 మందిని రికార్డుల్లో మరణించినట్లు చూపించి భారీ స్కామ్‌కు పాల్పడ్డారు.

గెజిటెడ్ అధికారుల సంతకాలను కూడా వీరు ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఇంకుతో నకిలీ సంతకాలు పెట్టి, అధికారులను సైతం నమ్మించేలా పత్రాలను సిద్ధం చేశారు. ఈ పత్రాల ఆధారంగా ఎల్ఐసీ నుంచి ఏకంగా రూ. 1.52 కోట్ల కాజేశారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఎల్ఐసీ యంత్రాంగం కనిపెట్టలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. ఎల్ఐసీ ఉన్నతాధికారులు లోతైన విచారణ జరపడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bhadrachalam Fake Death Certificate Fraud LIC Agents Fraud LIC Scam Telangana crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.