📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG 2047: తెలంగాణ రైజింగ్ తో కొత్త పుంతలు సమగ్ర భవిష్యత్తును నిర్మిద్దాం: డిసిఎం భట్టి

Author Icon By Rajitha
Updated: November 19, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka) అన్నారు. మంగ ళవారం ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.

Read also: Cine Piracy: కోట్లాది రూపాయల నష్టానికి కారకుడైన ఇమ్మడి రవి

Let’s build a new and comprehensive future with Telangana Rising: DCM Bhatti

మొదటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో వివరించాం రెండవ సంవత్సరం చేసిన కార్యక్రమాలు వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం పట్ల మా కల ఏంటి, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నాం అనేది తెలంగాణ రైసింగ్ ఉత్సవంలో వివరించబోతున్నామని తెలిపారు. బ్యాంకులు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 49.45శాతం ప్రాధాన్య రంగ రుణాలను సాధించాయి. క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 130.18 శాతంగా ఉండటం తెలంగాణ ఆర్థిక ప్రయాణంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుందనీ తెలిపారు. ఈ వేగం ప్రోత్సాహకరం, కానీ ఇదే సమయంలో మనం మరింత ఎత్తుకు చేరే బాధ్యత కూడా మనపై ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకుంది.

మహిళా ఆధారిత ఆర్థిక మార్పును వేగవంతం చేయాలని

రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటలు ఉచిత విద్యుత్. వీటికి మీ భాగస్వామ్యం కలిస్తే, మరింత ప్రతిఘటన శీలమైన, వాతావరణ మార్పులకు సిద్ధమైన వ్యవసాయ రంగాన్ని నిర్మించగలం అరే డిప్యూటీ సీఎం విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహిళలు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు ఎక్కువ పరిమితులు, వేగవంతమైన రీపీట్ ఫైనాన్స్ అందించాలి అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ఒక శక్తివంతమైన వేదిక. దీనిని పూర్తిస్థాయిలో వినియోగించి మహిళా ఆధారిత ఆర్థిక మార్పును వేగవంతం చేయాలని బ్యాంకులను కోరుతున్నాను అన్నారు. ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉపాధి మరియు ఆవిష్కరణలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు ఎంఎస్ఎంఈల కోసం ఏసీపీ లక్ష్యాలలో 50.23 శాతం సాధించినప్పటికీ, వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, రుణాల ప్రక్రియలో ఆలస్యం అనేక సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bhatti-vikramarka latest news Telangana telangana-rising Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.