Leopard Attack: నిర్మల్ జిల్లాలోని (Nirmal District) సరిహద్దు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తానూరు, భైంసా, కుభీర్, కుంటాల మండలాల్లో చిరుత సంచరిస్తుండటంతో అటు రైతులు, ఇటు పశుపోషకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వరుస దాడులతో పశువుల మృతి
భైంసా మండలంలోని సిరాల గుహల్లో చిరుత పులి తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్ ప్రాంతంలో అడవి పందులు, జింకల సంచారం పెరిగింది. వీటిని వేటాడే క్రమంలోనే చిరుత వస్తోందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అడవి జంతువులు పొలాల్లోని మొక్కజొన్న పంటలను నాశనం చేస్తుండగా, వాటిని వెంబడిస్తూ వస్తున్న చిరుత పశువుల పాలిట యముడిగా మారింది.
స్థానిక రైతులు, పశువులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మేకలు, గొర్రెలు, లేగదూడలు, ఎద్దులు, గేదెలు వన్యమృగాల బారిన పడుతుండటంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 17న భైంసా మండలం సిరాల శివారులో రైతు రామేశ్వర్‌కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. గురువారం మాధవ్ మొక్కజొన్న పంటలోకి వచ్చిన జింకను చిరుత హతమార్చింది. అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిరుత దాడేనని నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు రాత్రివేళ పశువులను బయటకు కట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: