Leopard Attack: చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళనలు

Read Time:  1 min
Leopard Attack: చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళనలు
FONT SIZE
GET APP

Leopard Attack: నిర్మల్ జిల్లాలోని (Nirmal District) సరిహద్దు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తానూరు, భైంసా, కుభీర్‌, కుంటాల మండలాల్లో చిరుత సంచరిస్తుండటంతో అటు రైతులు, ఇటు పశుపోషకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Read Also: Steamed Rice : స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

Leopard Attack: చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళనలు
Leopard Attack: Leopard roaming… panic among people

వరుస దాడులతో పశువుల మృతి

భైంసా మండలంలోని సిరాల గుహల్లో చిరుత పులి తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్‌ ప్రాంతంలో అడవి పందులు, జింకల సంచారం పెరిగింది. వీటిని వేటాడే క్రమంలోనే చిరుత వస్తోందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అడవి జంతువులు పొలాల్లోని మొక్కజొన్న పంటలను నాశనం చేస్తుండగా, వాటిని వెంబడిస్తూ వస్తున్న చిరుత పశువుల పాలిట యముడిగా మారింది.

స్థానిక రైతులు, పశువులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మేకలు, గొర్రెలు, లేగదూడలు, ఎద్దులు, గేదెలు వన్యమృగాల బారిన పడుతుండటంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 17న భైంసా మండలం సిరాల శివారులో రైతు రామేశ్వర్‌కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. గురువారం మాధవ్‌ మొక్కజొన్న పంటలోకి వచ్చిన జింకను చిరుత హతమార్చింది. అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిరుత దాడేనని నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు రాత్రివేళ పశువులను బయటకు కట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.