తెలంగాణకు నష్టం కలిగించే ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రానికి నష్టం కలిగించేందుకు ముందుకు తీసుకెళ్తున్న బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను నిలువరించేందుకు న్యాయపరంగా పోరాడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) ప్రకటించారు. బనకచర్ల ప్రాజెక్టు రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు సంబంధించిన కార్యాచరణ పథకంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే అన్యాయాన్ని దేశానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ విషయంలో రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లారని, అందులో ఉన్న న్యాయ వ్యతిరేక అంశాలు ఏమిటన్న దానిపై పూర్తి వివరాలతో ప్రజలకు స్పష్టతనివ్వాలని సూచించారు.
జూన్ 30న ప్రజాభవన్‌లో ప్రజెంటేషన్
ఈ నెల 30న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బనకచర్ల ప్రాజెక్టుపై స్పెషల్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు ఎలా రూపుదిద్దుకున్నదో, దాని వ్యాపక ప్రణాళికలు ఎలా ఉన్నాయో తదితర అంశాలపై ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రజల మద్దతుతోనే తెలంగాణ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
Read Also : Metro Phase-2 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం మొండిచేయి – శ్రీధర్ బాబు