📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LB Nagar Cybercrime: లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

LB Nagar Cybercrime: ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌ కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్సైలు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.

Read Also: Heat wave Exgratia: తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

LB Nagar Cybercrime: Cybercrime SSIs caught taking bribe

పోలీస్ స్టేషన్‌లో ముమ్మర సోదాలు

ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబునాయక్, ఎస్ఐ ప్రమోద్‌ ఒక కేసు విషయంలో నిందితుడిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు, నోటీసులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు లక్ష రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్లాన్ వేశారు.

ఫిర్యాదుదారు నుంచి ఆ లక్ష రూపాయల నగదును ఎస్ఐలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లతో పాటు, ఇతర అక్రమాలు ఏమైనా జరిగాయా అనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. అరెస్టయిన ఎస్సైలు బాబునాయక్, ప్రమోద్‌లను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

acb raids Cyber Crime Hyderabad Police Bribery Case Latest News in Telugu LB Nagar SI Babunaayak SI caught SI Pramod Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.