రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కల్పించాలి: కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్ : దేశంలో యూరియా వాడకాన్ని తగ్గించేలా తగ్గించేలా కేంద్రం దీర్ఘకాల చర్యలు చేపట్టాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Minister Tummala Nageswara Rao) విజ్ఞప్తి చేశారు. ఆర్గానిక్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి దేశంలో యూరియా వాడకాన్ని తగ్గించేలా దీర్ఘకాల చర్యలు చేపట్టాలని చెప్పారు. కనీసం 40-50 వ్యవసాయ భూములను ఎరువులపై ఆధారపడని సేంద్రియ పద్ధతులకు మార్చాలని, దీనికి తగ్గట్టు పెద్ద ఎత్తున రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పామాయిల్ పై దిగుమతి సుంకాలను పెంచి పామాయిల్ రైతులను రక్షించాలని కోరుతుంటే దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం కేంద్ర ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు.
ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఇబ్బంది
కేంద్రం,అసమర్థతతో దేశంలో ఇప్పటికే యూరియా (Urea) కొరతతో రైతులు ఇబ్బంది. ది పడుతున్నారని, కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వలన పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అక్రమ హెర్బిసైడ్ టాలరెంట్ విత్తనాలపై కేంద్రం ఇప్పటికీ ఒక సమగ్ర విధానం తీసుకోకపోవడం దారుణం అన్నారు.
రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అవసరమైతే దేశవ్యాప్తంగా,రైతు సంఘాలతో కలసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దేశీయంగా రామగుండం, కాకినాడ వంటి ప్లాంట్లు నిలిచిపోవడం, కేంద్రానికి ముందుచూపు లోపించడం వల్ల యూరియా సరఫరా కష్టమైందని, ఫలితంగా నిరసనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం 10 వ్యవసాయ భూమిని ఆర్గానిక్ ఫార్మ్స్ గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: