📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest News: Maoists లొంగిపోయిన ఇద్దరు సీనియర్ మావోయిస్టులు

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (మన్సూరాబాద్) : ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు రాచకొండ సీపీ సుధీర్ బాబు ముందు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత(62), ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్(35) అలియాస్ రామన్న అలియాస్ కాకరాల శ్రీను, లు గురువారం లొంగిపోయారు. ఈ వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు (Rachakonda CP Sudheer Babu) గురువారం ఎల్బీనగర్ లోని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాకరాల సునీత అలియాస్ బద్రి తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పని చేసినట్లు సిపి తెలిపారు.వరరావు, గద్దర్ లాంటి విప్లవకారులు వీరి ఇంటికి వస్తుండటంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారన్నారు. 1986 జనవరిలో ఆమె సిపిఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ వైపు పూర్తిగా ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. 1986 నుండి 1990 వరకు విజయవాడ పట్టణంలో సిపిఐ (ఎంఎల్) పిడబ్ల్యూ సెంట్రల్ ఆర్గనైజర్ (సిఓ)గా పనిచేసిందని అన్నారు.

నల్లమలలో ఉన్న సమయంలో వెలిగొండ

విజయవాడలో సీఓగా పనిచేస్తున్న సమయంలో ఆమెకు టిఎల్ఎన్ చలం అలియాస్ గౌతమ్ సుధాకర్ తో పరిచయం ఏర్పడిందని వారి పరిచయం ప్రేమగా మారింది. ఆగస్టు 1986లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1990 నుంచి 1992 వరకు ఆమె గుంటూరు పట్టణంలో సెంట్రల్ ఆర్గనైజర్ (సిఓ)గా పనిచేశారు. 1992లో, ఆమె నల్లమల అడవిలోకి వెళ్లి, అక్కడ ఫారెస్ట్ డివిజనల్ కమిటీలో పనిచేసిందని తెలిపారు. నల్లమల (Nallamala) లో ఉన్న సమయంలో వెలిగొండ, భైరవకోన ఎన్ కౌంటర్లలో పాల్గొన్నదని 2001 వరకు నల్లమలలో పనిచేసిందన్నారు. 2001లో ఆమెకు డివిజనల్ కమిటీ సభ్యురాలుగా పదోన్నతి లభించిందని చెప్పారు. 2001లో ఆమె భర్త టిఎల్ఎన్ చలం తో కలిసి ఆంధ్రాఒడిశా సరిహద్దు ప్రాంతానికి బదిలీ చేయబడిందని చెప్పారు. అక్కడ ఆమె 2006 వరకు పనిచేసి ఏఓబి లో పనిచేసిన పదవీకాలంలో పూజారి గూడ ఎన్కౌంటర్లో పాల్గొందన్నారు.

Latest News

అన్నపురం నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో

2006లో ఆమె భర్త టిఎల్ఎన్ చలంతో పాటు, ఆమెను దండకారణ్యం (డికె) కు బదిలీ చేశారు. దండకారణ్యం కార్యకర్తలలో సైద్ధాంతిక, రాజకీయ అవగాహన లేకపోవడంతో కేడర్ లో సైద్ధాంతిక, రాజకీయ అవగాహనను బలోపేతం చేయడానికి కేంద్ర కమిటీ ప్రత్యేకంగా సునీత చలంను డికె కు నియమించిందని తెలిపారు. 2014లో ఆమె కుతుల్ ఎన్కౌంటర్లో పాల్గొందని చెప్పారు. 2025 జూన్ 5న, ఆమె తన భర్తతో కలిసి అన్నపురం నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో పాల్గొన్నదని చెప్పారు. ఈఓపిలో ఆమె భర్త టిఎల్ఎన్ చలం చనిపోయాడని తెలిపారు. 2006 నుంచి ఇప్పటివరకు ఆమె తన భర్తతో కలి గణనీయంగా రీజినల్ పొలిటికల్ స్కూల్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిందన్నారు. మావోయి పార్టీ రూపొందించడ మేధావిగా, ఆమె పలు వ్యూ చెప్పారు. ఇదే కాకుండా అనేక పత్రాలను తయాడా చేయడంలో, క్రాంతి వంటి పార్టీ పత్రికలను ప్రచురించడంలో, ముఖ్యమైన పాత్ర పోషించిందని 40 సంత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ విభాగాలలో పనిచేశారని చెప్పారు. కాగా వారిపై ఉన్న రివార్డ్స్ వారికి అందజేస్తామని సీపీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-minister-komatireddy-to-hold-huge-south-india-csr-conference-on-november-8-minister-komatireddy/telangana/534234/

Breaking News central committee members Hyderabad News latest news mansoorabad Maoist Surrender rachakonda cp sudheer babu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.