📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Tollywood సినీ కార్మికుల వేతనాలు పెంపు..

Author Icon By Anusha
Updated: August 31, 2025 • 9:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమలో గత మూడు వారాలుగా నిలిచిపోయిన షూటింగ్‌ల సమస్యకు చివరికి తెరపడింది. వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మె, ఫెడరేషన్ పిలుపుతో జరిగిన బంద్ కారణంగా ఫిల్మ్ నగర్ వాతావరణం గందరగోళంగా మారింది. దాదాపు మూడు వారాలపాటు చిన్నా పెద్దా చిత్రాలన్నీ ఆగిపోవడంతో నిర్మాతలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, లైటింగ్ విభాగం, మేకప్ మాన్‌లు, సెట్స్ వర్కర్స్ వంటి కింది స్థాయి కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది.తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ మొదటగా వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌పై నిర్మాతల మండలి అయిన ఫిల్మ్ చాంబర్ (Film chamber) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే చిత్ర నిర్మాణ వ్యయాలు ఆకాశాన్నంటుతున్నాయని, ఈ సమయంలో ఇలాంటి పెంపులు సాధ్యం కాదని నిర్మాతలు వాదించారు. కానీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గే స్థితిలో లేరు. పలుమార్లు జరిగిన చర్చల్లో ఇరువర్గాలు ఒకరినొకరు ఒప్పించలేకపోవడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో

మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. పరిశ్రమ పెద్దగా, అందరి గౌరవాన్ని పొందిన నేతగా ఆయన మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నించారు. రెండు వర్గాలతో కూడా కూర్చొని మాట్లాడారు. కార్మికుల కష్టాలను నిర్మాతలకు వివరించగా, నిర్మాతల సమస్యలను కార్మికులకు అర్థమయ్యేలా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రయత్నాలూ ఫలితం ఇవ్వలేదు. చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) రంగంలోకి దిగడంతో ఒక్కరోజులో సమస్యకు పరిష్కారం లభించింది. ఇరువర్గాలు కాస్త వెనక్కి తగ్గడంతో బంద్‌కి ఎండ్‌కార్డ్ పడి ఫిల్మ్ నగర్ మళ్లీ షూటింగులతో కళకళలాడుతోంది. కార్మికుల డిమాండ్లతో మొదటిదైన వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించడమే కాదు తాజాగా దాన్ని అమలు కూడా చేశారు.సినీ పరిశ్రమలో కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ తాజాగా ప్రకటించింది. ఈనెల 22న కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు 22.5 శాతం వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు ఈనెల 22 నుంచి వచ్చే 2026, ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని నిర్మాతలను ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆదేశించింది.

Latest News

షూటింగ్ సమయంలో

సంఘాల వారీగా వేతనాలను సవరిస్తూ ప్రొడ్యూసర్లకు లేఖలు పంపింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా చేసి ‘ఏ’ కేటగిరిలో రూ.1,420, బి కేటగిరిలో రూ.1,175, సీ కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్ సమయంలో ఉదయం అల్పాహారం ఇవ్వకపోతే అదనంగా రూ.70, మధ్యాహ్నం భోజనం సమకూర్చకుంటే రూ.100 ఇవ్వనున్నారు.అలాగే మార్నింగ్ 9 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు కాల్షీట్‌కి రూ.1,470, సగం కాల్‌షీట్‌కి 735 రూపాయలు చెల్లించనున్నారు. కాల్‌షీట్ సమయంలో 4 గంటలు దాటితేనే పూర్తి వేతనం చెల్లిస్తారు. జీతాల పెంపు, కాల్‌షీట్లకు సంబంధించి కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీకి తెలియజేయాలని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ కమిటీ ఏర్పాటయ్యే వరకు కార్మిక శాఖ నిర్ణయించిన ఆగస్టు 21న తేదీ నాటి మినిట్స్‌నే ఫాలో కావాలని ప్రొడ్యూసర్లను ఆదేశించారు. 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇతర అన్ని పని నిబంధనలు, అలవెన్సులు ఉంటాయని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/balayya-receives-rare-award/cinema/actor/538606/

Breaking News chiranjeevi mediation film shootings stopped latest news revanth reddy intervention telugu cine workers federation Telugu News tollywood bandh Tollywood Strike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.