📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: TGSRTC – నేత్రదానానికి టిజిఎస్ఆర్టిసి తోడ్పాటు

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సామాజిక బాధ్యతలో భాగంగా నేత్ర దానానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టీసి) తోడ్పాటు అందిస్తోందని సంస్థ ఎండి విసి సజ్జనార్ (MD VC Sajjanar) తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా ఆర్టీసి బస్సుల్లో హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించినట్టు తెలిపారు. నెట్వర్క్ టు సైట్ పేరుతో సరోజిని దేవి కంటి ఆసుపత్రితో ఆర్టిసి అవగాహన ఒప్పందం(ఎంవోయు) చేసుకుంది. హైదరాబాద్ మెహిదిపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై ఆర్టీసి ఎండీ విసి సజ్జనార్.. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

ఐస్ బాక్స్ లో భద్రపరిచి ఆర్టీసి లాజి స్టిక్స్ కేంద్రాల్లో

ఈ ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్రదాతల నుంచి సేకరించిన కార్నియాలను ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్కు పంపిస్తారని.. సేకరించిన కార్నియాలను ఐస్ బాక్స్ లో భద్రపరిచి ఆర్టీసి లాజిస్టిక్స్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందజేస్తారని.. వాటిని తమ బస్సుల్లో హైదరాబాద్కు ఆర్టిసి డ్రైవర్లు తీసుకువస్తారని విసి తెలిపారు. బస్సులు హైదరాబాద్ చేరుకోగానే సరోజిని కంటి ఆసుపత్రి సిబ్బంది (Sarojini Eye Hospital staff) వచ్చి వాటిని తీసుకుని.. ఐ బ్యాంక్ లో భద్రపరుస్తారని తెలిపారు.పవిత్రమైన ఈ దాతృ త్వ కార్యక్రమంలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని సజ్జనార్ తెలిపారు. నెట్వర్క్ టు సైట్పై ఆర్టిసి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. మృతి చెందాక అత్యంత విలువైన అవయవాలను మట్టిపాలు చేసేకన్నా అంధత్వంతో లోకాన్ని చూడలేని వారికి చూపునీయడం గొప్ప కార్యమన్నారు.

Latest News

ఉచితంగా తరలించేందుకు ముందుకు వచ్చిన టిజిఎస్ఆర్టిసి

భారతదేశంలో ప్రతి ఏటా 3 లక్షలకుపైగా మంది నేత్రాల కోసం ఎదురుచూస్తుంటే.. కేవలం 18 వేల మార్పిడిలు మాత్రమే జరుగు తున్నాయని గుర్తుచేశారు. మరణాంతరం నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని మాట్లాడుతూ.. ఉచితంగా కార్నియాలను బస్సు ల్లో ఉచితంగా తరలించేందుకు ముందుకు వచ్చిన టిజిఎస్ఆర్టిసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసి బస్సుల్లో సురక్షి తంగా కార్నియాలను సరోజిని కంటి ఆసుపత్రికి తీసుకువచ్చి రోగులకు అమర్చుతామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసి ఎండి సజ్జనార్ సజ్జనర్ నేత్రదాన ప్రతిజు చేసి.. నేత్రదాన ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేసి సరోజిని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదినికి అందజేశారు.

Read hindi news:

Read Also:

https://vaartha.com/gopinaths-wife-in-the-jubilee-hills-race/telangana/543685/

Breaking News eye donation free transport hyderabad latest news memorandum of understanding network to sight Sarojini Devi Eye Hospital social responsibility Telugu News tsrtc VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.