📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: TG Rains మరో మూడు రోజులు హైదరాబాద్ కు భారీ వర్షాలు..బయటికి రాకండి

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ (Hi-Tech City) ప్రాంతాల్లో రహదారులు నీటితో నిండిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మాధాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాహనాలు నీటిలో ఇరుక్కుపోవడంతో రాత్రంతా డ్రైవర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం కార్యాలయ సమయాల్లో కూడా రోడ్లపై నీరు తగ్గకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం వల్ల రహదారులు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. ఎర్రమంజిల్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని

ఈ పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు అత్యవసర సూచనలు జారీ చేశారు.అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులను స్టాగర్డ్ వర్కింగ్ అవర్స్ పాటించాలని ఆదేశించాయి. దీని ప్రకారం.. ఉద్యోగులు ఒకేసారి కార్యాలయాలకు రాకుండా.. విడతల వారీగా సమయాన్ని మారుస్తూ పని చేయాలని పోలీసులు సూచించారు. దీని ద్వారా రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే భారీ వర్షాలకు అలర్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు. మాధాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లో రోడ్లు పూర్తిగా నీటిమునిగిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్‌లో భారీగా చెట్లు కూలిపోయాయి. ఎర్రమంజిల్, మియాపూర్, చందానగర్‌లో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అత్యవసర బృందాలు నీటిని పంప్ చేసి రహదారులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే వర్షం కొనసాగుతుండటంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

Latest News

ప్రత్యేకంగా నీటిమునిగిన ప్రాంతాల్లో నివసించే

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే రెండు రోజులపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా నడవాలని అధికారులు హెచ్చరించారు. నిన్న రాత్రి మేము ఇంటికి చేరుకోవడానికి మూడున్నర గంటలు పట్టింది. రహదారులన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ రోజు ఆఫీసుకు రావాలా వద్దా అనే అనుమానంలో ఉన్నామని ఒక ఐటీ ఉద్యోగి తెలిపారు. మరోవైపు, కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) ఎంపికను ఇచ్చాయి. ప్రత్యేకంగా నీటిమునిగిన ప్రాంతాల్లో నివసించే ఉద్యోగుల కోసం ఇంటి నుండే పనిచేయాలని సూచించాయి. హైదరాబాద్‌లో వర్షం నగర రవాణా, విద్యుత్ సరఫరా, ఐటీ కారిడార్‌లోని కార్యాలయ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు, కంపెనీలు కలసి తీసుకుంటున్న చర్యల వల్ల పరిస్థితి కొంతవరకు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో గత మూడు రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వరదలకు కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద నేషనల్‌ హైవే 44 కుంగిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రోడ్డు శుక్రవారం ఉదయం బ్లాక్‌ అయ్యింది. సదాశివనగర్‌ నుంచి పొందుర్తి వరకు.. 20 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలు భారీ వరదలకు అతలాకుతలం అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో ఏపీ,తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-heavy-rain-khammam-district-rainfall/telangana/537667/

Gachibowli waterlogging Hitech City rains Hyderabad heavy rainfall Hyderabad Rains Hyderabad traffic chaos Madhapur flooding Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.