📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Telangana – డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరుకు ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు ..పూర్తి వివరాలు

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 7:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో విద్యా రంగాన్ని మోడరన్‌గా, సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి రేవంత్ సర్కారు గణనీయమైన ప్రాముఖ్యత ఇస్తోంది. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిలో ప్రధానంగా ఇంతకుముందు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, విద్యార్ధులకు మోడరన్ సౌకర్యాలు కల్పించడం ఉన్నాయి. ఇవి విద్యార్థుల (Students) సామర్థ్యాన్ని పెంపొందించడంలో, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు సమస్య తెలంగాణలో పలుసార్లు వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించకుండానే జీతాలు పొందుతుండటం, సమర్థవంతమైన పాఠ్యక్రమ నిర్వహణకు అవరోధంగా మారింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఫేసియల్ రికగ్నైజేషన్ ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఉపాధ్యాయులు తరగతులకు హాజరు అవుతున్నారా, లేదా అనేది సరిగ్గా గుర్తించబడుతుంది. ఫలితంగా పాఠశాలల నిర్వహణ మరింత పారదర్శకమవుతుంది.

డిగ్రీ, పీజీ విద్యార్థులకు కీలక అలర్ట్

అలానే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థులకు కూడా ఫేసియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు..రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక అలర్ట్ జారీ చేసింది. వీరి హాజరుకు సంబంధించి సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో డుమ్మా చదువులుకు చెక్ పడనుంది.

ఇంతకు నూతన హాజరు విధానం ఏంటి అంటే.. త్వరలోనే డిగ్రీ, పీజీ అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం (Facial attendance policy) అమలు చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విద్యాశాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరుకు సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం ఆదేశాల అమలుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది.

Telangana

నాన్ టీచింగ్ స్టాఫ్‌కి కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం

ఈక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.. శుక్రవారం నాడు కౌన్సిల్ ఆఫీసులో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో ప్రధానంగా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం (FRS policy) హాజరు అమలు చేయాలనే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారు పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నారు. త్వరలోనే ఈ విద్యార్థులందరికి కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం అమలు చేయనున్నారు.ప్రస్తుతం తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల హాజరుకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (Facial recognition system) విధానం అమలవుతోంది.

దీనికోసం ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ (AI technology) తో పనిచేసే ప్రత్యేక యాప్‌ను డిజైన్ చేయించింది. ఈ యాప్‌లో ఒకసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు. ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరు నమోదవుతుంది. ఒకేసారి తరగతి గదిలోని 15-20 మంది హాజరు కూడా తీసుకోవచ్చు. ఒకటో తరగతిలో విద్యార్థి ఫేషియల్ పాయింట్లు తీసుకుంటే డిగ్రీ చదివే వరకు పనిచేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-heavy-rains-next-2-days-alert/telangana/546048/

Breaking News degree students facial recognition system Integrated Schools latest news Quality Education student attendance teacher attendance telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.