📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Latest News: Secunderabad railway station – పండుగ రద్దీ కోసం రైల్వే ఏర్పాట్లు

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికుల నియంత్రణకు ప్రణాళిక

హైదరాబాద్ (తార్నాక) : రాబోయే పండుగ సీజన్లో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణీకుల రద్దీని నిర్వహించడానికి దక్షిణమధ్య రైల్వే (South Central Railway) సమాయత్తం అవుతోంది. ప్రయాణీకుల కదలికలపై జోన్ శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి, సమగ్ర జనసమూహ నిర్వహణ ప్రణాళికను రూపొందించింది. జంట నగర ప్రాంతంలోని వివిధ స్టేషన్ల నుండి ప్రసిద్ధ గమ్యస్థానాలకు అదనపు రైలు సర్వీసులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్లోని ప్రధాన పునరాభివృద్ధి పనుల దృష్ట్యా, టెర్మినల్ భవనాల ప్రధాన భాగాలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనిచేయవు. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించింది.

వివరణాత్మక అధ్యయనం

సికింద్రాబాద్ స్టేషన్ లో సాధారణ రోజుల్లో రోజుకు 1.3 లక్షల మంది ప్రయాణికులు, పండుగ కాలంలో రోజుకు 2 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తుంటారు. స్టేషన్ లోపల ప్రయాణీకుల ప్రవాహాన్ని అర్ధం చేసుకోవడానికి, రెండు రోజులలో వివరణాత్మక అధ్యయనం నిర్వహించ బడింది. ఈ అధ్యయనం ప్రకారం ప్లాట్ఫారం! వైపు ప్రయాణీకులకు ప్రవేశ, నిష్క్రమణ మార్గంగా ప్రసిద్ధి చెందింది: రిజర్వేషన్ లేని ప్రయాణీకులలో దాదాపు 8090 శాతం మంది సికింద్రాబాద్ స్టేషన్ లోని ప్లాట్ఫాం నంబర్ 1 వైపును ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్లాట్ ఫారం 10 వైపు,స్టేషన్తో పోలిస్తే ఆర్టీసీ బస్సులు, మెట్రోలు, హోటళ్లతో బాగా అనుసంధానించబడి ఉంది.

చర్లపల్లి వంటి శాటిలైట్ స్టేషన్లలో

ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలు, సాయంత్రం రద్దీ సమయాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ప్లాట్ఫామ్ మెట్ల ద్వారా గంటకు 10000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ (Secunderabad railway station) లోపల రద్దీని తగ్గించడానికి వ్యూహాలు సికింద్రాబాద్ స్టేషన్ రాకుండా కొన్ని రైళ్ల మళ్లించనున్నారు. రద్దీ సమయాల్లో కొన్ని రైళ్లను సనత్నగర్, అమ్ముగూడ మౌలాలి, చర్లపల్లి మీదుగా మళ్లించడం, చర్లపల్లి వంటి శాటిలైట్ స్టేషన్లలో అదనపు హాల్ట్లను ఏర్పాటు చేయడం గురించి ఆలోచిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో టిక్కెట్లు తీసుకునే ప్రాంతం వెలుపల, ప్లాట్ ఫారమ్ 1, ప్లాట్ ఫారం 10 వైపులా హోల్డింగ్ ప్రాంతాలను కేటాయించింది. ఇక్కడ ప్రయాణికులు రైలు వచ్చే సమయం వరకు వేచి ఉండవచ్చు.

Latest News

స్టేషన్లో నావిగేట్ చేయడానికి సంకేతాలను

పిఎఫ్ 1 వైపు, రెండు హోల్డింగ్ ప్రాంతాలు, ఒకటి గేట్ నంబర్ 2 వద్ద మరియు మరొకటి గేట్ నంబర్ 5 దగ్గర 1500 మంది ప్రయాణికుల సామర్థంతో అందుబాటులో ఉంటుంది. ప్లాట్ఫారమ్ నంబర్ 10 వద్ద, 1125 మంది ప్రయాణికుల సామర్థంతో గేట్ నంబర్ 8 వద్ద ఒక హోల్డింగ్ ప్రాంతం అందుబాటులో ఉంటుంది. స్టేషన్లో నావిగేట్ చేయడానికి సంకేతాలను ఉపయోగించాలని, ప్రకటనలను అనుసరించాలని ప్రయాణికులకు విజప్తి చేశారు. ప్లాట్ ఫారమ్ 1 నుండి సికింద్రాబాద్ (పశ్చిమ) మెట్రోకు కొత్త ప్రవేశం, నిష్క్రమణ: ప్రవేశించే, నిష్క్రమించే ప్రయాణీకులను వేరు చేయడానికి, పి.ఎఫ్ 1 నుండి సికింద్రాబాద్ (పశ్చిమ) మెట్రో స్టేషన్కు కొత్తప్రవేశం, నిష్క్రమణను నిర్మిస్తున్నారు.

పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉన్నాయి

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రయాణీకుల రాకపోకలపై నిఘా కార్లు, టాక్సీలు, క్యాబ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ప్లాట్ ఫారం 1 వైపు కాకుండా టెర్మినల్ యొక్క ప్లాట్ ఫారం 10 వైపు ఉపయోగించమని ప్రోత్సహించబడి నది. ప్లాట్ ఫారం 1 వైపు పికప్, డ్రాప్ ఆఫ్బలు, పార్కింగ్ సౌకర్యం పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మెరుగైన టికెటింగ్, ప్రయాణీకుల సౌకర్యాలు: అదనపు హెల్ప్ డెస్క్లు/ ఎంక్వైరీ కౌంటర్లు కూడా పనిచేస్తాయి. రైలు కదలికను పర్యవేక్షించేందుకు. స్టేషన్లో జనసమూహాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ రైల్వే అధికారులు 24 గంటలూ విధుల్లో ఉంటారు. సులభంగా, త్వరగా టికెట్ జారీ చేయడానికి అదనపు టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్ జంక్షన్ ఎప్పుడు ప్రారంభించబడింది?

ఈ స్టేషన్ 1874లో ప్రారంభించబడింది.

సికింద్రాబాద్ జంక్షన్ ప్రత్యేకత ఏమిటి?

ఇది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రధాన కార్యాలయం. అలాగే హైదరాబాదు-సికింద్రాబాద్ జంట నగరాల ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఒకటి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/by-elections-are-certain-within-6-months-ktr/telangana/542170/

Additional trains Breaking News festive season travel hyderabad latest news passenger rush management secunderabad station South Central Railway taranaka Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.