📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest News: Minister Jupally Krishna Rao- దుబ్బుల కళాకారులను ఆదుకుంటాం

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణకుమార్ హామీ

హైదరాబాద్ : దుబ్బులు కొలుపు కళాకారులను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా దుబ్బుల కొలుపు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర కమిటీ నాయకత్వంలో 50 మంది కళాకారులు మంత్రుల నివాసములో ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ను, రవీంద్రభారతిలో జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao, Adluri Lakshmana Kumar) కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రులు సానుకూలంగా స్పందించిన జూపల్లి కృష్ణారావు, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో మాట్లాడారు. వెంటనే గుర్తింపు కార్డులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సాంస్కృతిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. 600 మందికి 3 రోజులు వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు లెల్లెల బాల కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జునగరి దుర్గయ్య బోయిరి శ్రీకాంత్, కార్యనిర్వాహణ అధ్యక్షులు జూనగరి గణేష్, మాటూరి సంతోష్ (Maturi Santosh) మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 వేల కుటుంబాలు దుబ్బుల కొలుపు,మంత్రులు జూపల్లికృష్ణారావు, అడ్లూలి లక్ష్మణ్కుమార్లను కలిసిన దుబ్బులు కొలుపు కళాకారులు వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారని, దుబ్బుల కళాకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, భాష సాంస్కృతిక శాఖ నుండి గుర్తింపు కార్డులతో పాటు అర్హులైనవారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని విజప్తి చేశారు.

ప్రభుత్వం నుండి ఐడి కార్డుల మంజూరు కోసం ఉచిత శిక్షణ తరగతులు కోసం లలిత కళాతోరణంలో శిక్షణ తరగతులకు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ప్రతి దుబ్బుల కొలుపు కళాకారులను ఆదుకుంటామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి బోగిరి, సదానందం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, అసిఫాబాద్ కొమురం బీమ్ జిల్లా అధ్యక్షులు గిరుగుల సమ్మయ్య, జునగారి లక్ష్మణ్, జునగరి నారాయణ, బోగిరి రమేష్, బోగిరి మనోహం, భామినీ రాజకుమార్, రాష్ట్ర నాయకులు బామిని పోచం, బోగిరి సంతోష్, బోగిరి లక్ష్మణ్ సౌతకారి రవీందర్. సౌతకారి సంపత్, లక్ష్మణ్, లడ్డు రాజ్ కుమార్, బోగిరి రాజు కుమార్, నాందేవ్, విక్రమ్, సౌతాకారి అశోక్, బామ్మడ్ల పల్లి రాములు, బోయిరే వెంకటేష్, బామ్మడ్ల పల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-excise-department-increasing-penalties-in-excise/telangana/540988/

Adluri Lakshmana Kumar artists welfare Breaking News cultural support Dubbu Kolupu artists folk art Jupalli Krishna Rao latest news Telangana Culture telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.