తెలంగాణ బీఆర్ ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎంపీ సంతోష రావులపై కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన,సంచలన వ్యాఖ్యలతో ఆమెను బీఆర్ ఎస్ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. దీంతో నిన్న కవిత విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మళ్లీ హరీశ్ రావు, సంతోష రావు, కేటీఆర్ లపై విమర్శలు చేస్తూ, తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా,చేశారు.
ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిలో అంతర్గత విభేదాలు రాజుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు కవిత నాయకత్వంపై ఆ సంస్థకు చెందిన కీలక నేత మేడే రాజీవ్ సాగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా,కేసీఆర్ కోసమే పనిచేస్తామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కవిత తీసుకుంటున్న,నిర్ణయాల వల్ల సంస్థలోని కార్యకర్తల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆయన వాపోయారు.
మా జీవితాలు ఏం కావాలి?
కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల 19 సంవత్సరాలుగా సంస్థ కోసం కష్టపడిన వారి జీవితాలు, రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి?అని రాజీవ్ సాగర్ (Rajiv Sagar) ప్రశ్నించారు. జాగృతి సంస్థ కేసీఆర్, బీఆర్ ఎస్ పార్టీ ఆశయాల కోసం పనిచేయాలని, కానీ ఇప్పుడు ఎవరికోసం, ఎవరి ఆశయాల కోసం పనిచేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. కవిత వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నట్లుగా,కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
రాత్రింబవళ్లు మేం కవిత చెప్పినట్లు పనిచేశామని, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల,తామంతా బాధపడుతున్నామని అన్నారు. కవిత చేసిన పని వల్ల మా జీవితాలు రోడ్డున పడ్డాయని రాజీవ్ సాగర్ ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ ఎస్ పార్టీ గెలుస్తుందని, తమ కష్టాలన్ని పోతాయని, తిరిగి కేసీఆర్ సీఎం,అవుతారనే భవిష్యత్తుపై నమ్మకంతో పనిచేస్తుంటే ఇప్పుడు తమ ఆశలన్నీ తలకిందులుగా మారిందని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: