📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest News: Kavitha బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామం.. తెలంగాణ బొగ్గు గని సంఘం నుండి కవిత ఔట్

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఎదురైంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగించి, ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ పరిణామంపై కవిత స్వయంగా స్పందించారు. తనను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికలు కార్మిక చట్టాలకు విరుద్ధంగా జరిగాయని, సాంకేతికపరంగా ఇది తప్పు అని కవిత తీవ్రంగా విమర్శించారు. పదేళ్లుగా కార్మికులకు సేవ చేసే అవకాశం దక్కిందని, ఆ అనుభవాన్ని జీవితాంతం మరచిపోలేనని తెలిపారు.అదే సమయంలో కొత్తగా గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే, తనను తొలగించడం వెనుక కుట్రలు,జరిగాయని కవిత గట్టిగా ఆరోపించారు. కొందరు వ్యక్తులు తనపై రాజకీయ కుతంత్రాలు పన్నుతున్నారని, వారే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మిక హక్కుల కోసం ఎన్నో కృషులు చేశానని

కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.కవిత (Kavitha) తన పాత్రను గుర్తు చేస్తూ, తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి, రాష్ట్ర హక్కుల కోసం వారు పోరాడేలా ముందుండి నడిపించానని తెలిపారు. 2015లో టీబీజీకేఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి వచ్చిన 1000 మంది సభ్యుల సమక్షంలో గౌరవ అధ్యక్షురాలిగా తాను ఎన్నుకోబడ్డానని గుర్తు చేశారు. అప్పట్లో అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని తనకు కట్టబెట్టారని, అదే ఆధారంగా కార్మిక హక్కుల కోసం ఎన్నో కృషులు చేశానని అన్నారు.అంతేకాకుండా, సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కుల కోసం తాను గళమెత్తానని చెప్పారు. కార్మిక వర్గం బలహీనపడకూడదని, వారి ఐక్యతే వారికి బలమని కవిత మరోసారి పునరుద్ఘాటించారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు దురుద్దేశంతో తనను తొలగించే కుట్ర పన్నారని స్పష్టం చేశారు.పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను తాను ప్రశ్నించడం వల్లే తనపై కక్షగట్టారని కవిత పేర్కొన్నారు.

Latest News:

రాష్ట్రంలో నిలిపివేసిన డిపెండెంట్ ఉద్యోగాలను

కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ చేసిన కుట్రదారులు ఎవరో బయటపెట్టాలని తాను కోరినందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నా లేకపోయినా.. కార్మికుల కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు.తన పదవీకాలంలో కార్మికుల కోసం చేసిన కృషిని కవిత వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిలిపివేసిన డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్‌ను ఒప్పించి తిరిగి కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించానని తెలిపారు. తద్వారా 19,463 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించానని చెప్పారు. దాంతో పాటు రూ. 10 లక్షలకు పైబడిన హౌసింగ్‌ లోన్‌‌పై వడ్డీ చెల్లింపు, క్వార్టర్స్‌‌కు ఉచిత కరెంట్‌, ఉచిత ఏసీ, ఫీ రీయింబర్స్‌ మెంట్‌, ఆప్షనల్ సెలవులు, కార్పొరేట్‌ వైద్య సదుపాయాలు వంటి అనేక పథకాలను అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశానని ఆమె వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-crime-news-where-is-the-son-who-killed-his-mother-for-insurance-money/telangana/533743/

Breaking News kavitha shock koppula eshwar appointment latest news Political Controversy tbgks leadership change Telangana politics Telugu News trs brs news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.