📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest News: Excise Department -ఎక్సైజ్ లో పెరుగుతున్న శిక్షలు

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండేళ్లలో డబుల్ ఫిగర్ నిందితులకు 10, 5 సంవత్సరాల శిక్షలు

హైదరాబాద్ : కేసుల నమోదు శిక్షలు పడడమే ప్రమాణికం. కేసులు నమోదు చేయడమే కాదు.. నమోదు చేసిన కేసుల్లోని నిందితులకు శిక్షలు ఎంత మందికి పడుతున్నాయని అనేదే అసలైన ప్రశ్న. కేసులనమోదు చేసే పవర్ లాండ్ఆర్డర్ నిర్వహించే పోలీస్ శాఖకు, ఎన్టీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) తోపాటు నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, నాటుసారా తయారీ అమ్మకాలు, కల్తీ మద్యం తయారీపై కేసులు నమోదు చేసే అధికారం అవకాశం ఎక్సైజ్ శాఖ (Excise Department) కు ఉంది. ఈ రెండు శాఖలు నమోదు చేసే కేసుల పంచానామా, చార్జీషీట్, సాక్షయుల వాగ్మూలాలు కేసుల్లో శిక్షలు పడడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. నిన్న మొన్నటి వరకు మర్డర్, మానభంగం, దొంగతనం, చీటింగ్పై పలువురు నిందితులకు శిక్షలు పడడం, వినడం, చూడడం జరిగింది.

న్యాయమూర్తులు విధిస్తూ వస్తున్న తీర్పులతో

కాని ఈ మధ్య ఎక్సైజ్ శాఖ పరిధిలో నమోదు అవుతున్న కేసుల్లో కూడ నిందితులకు పదేళ్లు, ఐదేళ్లు జైలు శిక్షలు, రూ. లక్ష, రూ.50 వేల జరిమానాలు న్యాయమూర్తులు విధిస్తూ వస్తున్న తీర్పులతో ఎక్సైజ్ శాఖ సిబ్బందిలో ఆత్మ స్థైర్యం పెరిగింది. ఎక్సైజ్శాఖ సిబ్బందికి పోలీస్ శిక్షణ.. ఎక్సైజ్ శాఖ అంటే అమ్మకాలు, కల్తీ మద్యాన్ని అరికట్టడంపైనే ఎక్కువ దాష్టి పెట్టె వారు. కాని తెలంగాణలో కొత్త ప్రభుత్వం రావడం, గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారు. దీంతో పోలీసులతోపాటు ఎక్సైజ్ శాఖ గంజాయి, డ్రగ్స్ ను పట్టుకోవడంపై దాష్టి సారించారు.

ఎన్డీపీఎస్ చట్టంపై అవగహన కోసం

ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం 2021లో ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్) కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఎన్డీపీఎస్ చట్టం (NDPS Act) పై అవగహన కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్, ఎన్ఫోర్మెంట్ డెరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి టీజీ న్యాబ్ పర్య వేక్షణలో పోలీస్ అకాడమీలో ఎక్సైజ్శాఖకు సంబంధించిన 1190 మందికి కానిస్టేబుల్ నుంచి అన్ని స్థాయి అధికారులకు శిక్షణ ఇప్పించారు.

ఎన్పీడీఎస్ శిక్షణతోపాటు చార్జీషీట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంచానామాలో రాసే సమయంలో,ప్రభుత్వ ఉద్యోగులను సాక్షులగా ఎ చేర్చడం వంటి వాటిపై ఎక్సైజ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఎక్సైజ్ యంత్రాంగం గంజాయి, డ్రగ్స్, ఆల్ఫోజోలం లాంటి మత్తు పదార్ధాల కేసులో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడంతో ఎక్సైజ్ శాఖ కేసుల్లో శిక్షలు పడుతున్నాయని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

Latest News

మంత్రిత్వశాఖ సమాచారం మేరకు దేశంలో

ఎన్డీపీఎస్ కేసులు నమోదు.. 2022 ఎన్సీఆర్ ( నేషనల్ క్రైమ్ రికార్డు బూర్యో) కేంద్ర హోం మంత్రిత్వశాఖ సమాచారం మేరకు దేశంలో ఎన్పీడీఎస్ చట్టం కేరళలో 22,619 కేసులు, మహారాష్ట్రలో 13,830, పంజాబ్లో 12,442 365 మద్యా ఉత్తర ప్రదేశ్లో 11,541, తమిళనాడ్లో 10,385, ఏపీలో 1391, తెలంగాణలో 1279 కేసులు నమ్కోదెనట్లు రికార్డులు చెపుతున్నాయి. పంజాబ్లో 132, ఉత్తర ప్రదేశ్లో 2925, ఏపీలో 325, తెలంగాణలో 2689, హర్యానాలో 1189 మందికి శిక్షలు పడినట్లు రికార్డులు చెపుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ 2014లో ఏర్పడింది. తెలంగాణలో ఏర్పడిన అనంతరం రెండుమూడేళ్లు పాలసీల మార్పులకు సమయం పొయింది. మరో రెండేళ్లు కరోనాతో అన్ని రకాల కేసులు స్తంభించి పోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cms-visit-to-kamareddy-district-today/breaking-news/540972/

Breaking News court punishments crime cases Excise Department fake liquor latest news Law and order liquor cases narcotics control Police Department Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.