📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Latest News: Deputy CM Bhatti – వార్షిక రుణ ప్రణాళిక అమలు భేష్

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తొలి క్వార్టర్లో 33.64 శాతం నమోదు

బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి

హైదరాబాద్ : బ్యాంకర్ల కమిటీ నిర్ధారించిన వార్షిక రుణ ప్రణాళిక అమలు భేష్ గా ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలోతొలి క్వార్టర్లోనే 33.64 శాతం అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం హైదరాబాద్లో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తోందన్నారు. రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ.30 వేల కోట్లు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. అలాగే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా కూడా నిలిచిందని వెల్లడించారు.

రైతులను ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేశారు

ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగా లకు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. సకాలంలో రుణాలు (Loans) ఇవ్వడంతో పాటు, ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు అంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేశారు. బ్యాంకర్లు మానవియ కోణంలో ఆలోచించాలన్నారు. తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి. పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల్లో బలమైన వృద్ధితో పాటు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాందని వివరించారు. అర్హులైన రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, కొన్ని పంటలకు బోనస్, ప్రధానమధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటి ఫలితంగా వ్యవసాయం.

Latest News

కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి

అనుబంధ రంగాల వాటా పెరుగుతోంది అన్నారు. రైతుల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టి అర్హులైన వారికి రుణ మాఫీని తక్కువ సమయంలోనే అమలు చేసి చరిత్ర సృష్టించామన్నారు. వీటిలో గణనీయ సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి, రైతులకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలను సాధికారత కల్పించేందుకు, ఆదాయ సృష్టి చేసే కార్యకలాపాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం చేయాలని కోరారు. వ్యాపారానికి అనుకూలమైన, సృజనాత్మక విధానాలు మరియు ప్రభుత్వ చొరవల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి, పరిశ్రమల వృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-ameerpet-no-land-will-be-given-for-the-regional-ring-road/telangana/543853/

Annual Credit Plan Bankers Committee Banking Sector Breaking News Deputy CM Bhatti Vikramarka financial planning Implementation latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.