📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest News: CM Revanth Reddy – కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 8:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారంతో కూడిన సవాళ్లు, అలాగే రాబోయే ప్రతిష్టాత్మక విద్యా పథకాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం అవలంబించిన అప్పు విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతున్నాయని ఆవేదన

విచక్షణారహితంగా తీసుకున్న భారీ అప్పులు, అధిక వడ్డీ రేట్లతో కూడిన రుణాలు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రత్యేకించి విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాల్సిన నిధులు వడ్డీ చెల్లింపులకే (Interest payments) ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అధిక వడ్డీల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న అప్పులను రీస్ట్రక్చరింగ్ (పునర్‌వ్యవస్థీకరణ) చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి సహకరించాలని కోరారు.

Latest News

కీలక నిర్ణయం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. అదేవిధంగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా మోడల్ స్కూళ్ల’ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలని నిర్మలా సీతారామన్‌ను ఆయన అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు సమావేశం అనంతరం సీఎం పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-ktr-relief-for-ktr-in-the-high-court/telangana/544182/

Breaking News Delhi discussions latest news loan restructuring request Nirmala Sitharaman meeting Telangana CM Revanth Reddy Telangana financial crisis Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.