📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: CM Revanth Reddy – మహమ్మద్ సిరాజ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సిరాజ్ క్రీడల్లో చేసిన విజయాలను గుర్తిస్తూ, అతన్ని డీఎస్పీ పదవికి ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేసిన విషయాన్ని వెల్లడించారు.

క్రికెట్ రంగంలో సిరాజ్ (Mohammed Siraj) సాధించిన విజయాలను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, “సిరాజ్ మంచి ప్రదర్శన చూపించి, భారత జాతీయ జట్టుకు కీలకమైన గెలుపులు అందిస్తున్నాడు. అతను ఇంటర్ ఫెయిల్ అయినా, కొన్ని నియమాలకు విరుద్ధమైనప్పటికీ, వాటిని మార్చి, అతనికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తూ, డీఎస్పీగా ప్రమోట్ చేయడంలో నేను ముందడుగు వేసినది గర్వకారణం.”

భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు

శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం సిగ్గు చేటన్నారు.’140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ (Gold Medal) రాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా, అత్యధిక యువకులు ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం మనందరికి అవమానం. ఇటీవల సౌత్ కొరియా పర్యటన వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ‌లో పర్యటించాను. ఒలింపిక్స్‌లో సౌత్ కొరియా 32 మెడల్స్ గెలిస్తే.. అందులో 16 మెడల్స్ ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులే గెలిచారు.

Latest News

మూడు ఒలింపిక్ మెడల్స్ సాధించింది

మన ఉస్మానియా యూనివర్సిటీ 15- 16 వందల ఎకరాల్లో ఉంది. కానీ ఏం లాభం? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు నాకు స్వాగతం పలికిన ఒక అమ్మాయి.. ఆర్చరీ విభాగంలో మూడు ఒలింపిక్ మెడల్స్ సాధించింది. నాకు స్వాగతం పలికిన అమ్మాయిని నేను సన్మానించాల్సి వచ్చింది. చిన్న దేశం 32 పతకాలు గెలిస్తే.. ఇంత పెద్ద దేశం ఒక్క గోల్డ్ మెడల్ తీసుకురాకపోవడం అవమానం కాదా? అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టీచర్లందరిని నేను కోరేది ఒక్కటే.. నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి. క్రీడాకారులకు గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-n-srinivasan-n-srinivasan-takes-charge-as-csk-chairman/sports/542289/

Breaking News cricket stars dsp appointment Hyderabad News latest news Mohammed Siraj Revanth Reddy sports recognition Team India telangana cm Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.