📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest Crime News: తండ్రిపై పోక్సో కేసు నమోదు..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: July 18, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సభ్యసమాజం తలదించుకునే దారుణ సంఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. కన్న తండ్రి కన్న కూతురిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వాన్ని మరిచి, పాశవిక స్వభావంతో తన స్వంత బిడ్డనే లైంగికంగా వేధించేందుకు యత్నించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవరుప్పుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (minor girl) పై ఆమె స్వంత తండ్రే అసభ్యకరంగా ప్రవర్తించినట్టు సమాచారం. తండ్రి చేష్టలతో భయబ్రాంతులకు గురైన బాలిక, మొదటగా ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. కానీ తల్లి నుంచి ఎలాంటి సహాయం లేకపోవడంతో, చివరకు తన బాధను పెద్దమ్మకు తెలిపింది.

లైంగిక దాడులు

బాలిక పెద్దమ్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తుకు టౌన్ పోలీస్‌లు శ్రీకారం చుట్టారు. పోలీసులు మైనర్ బాలికను విచారించి, అన్ని వివరాలను రికార్డు చేశారు. అనంతరం తండ్రిని అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం (Protection of Children from Sexual Offences Act) కింద కేసు నమోదు చేశారు.పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు జరిపిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు విధించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింద నేరం నిరూపితమైతే అత్యల్పంగా 7 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకూ శిక్ష విధించవచ్చు. దీని ప్రకారం ఈ కేసులో కూడా నిందితుడికి తీవ్ర శిక్షలు తప్పవని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

Latest Crime News: తండ్రిపై పోక్సో కేసు నమోదు..ఎందుకంటే?

మానసిక ఒత్తిడికి

ఈ కేసులో తల్లి స్పందన లేకపోవడం, బాధిత చిన్నారి మాటలను పట్టించుకోకపోవడం పట్ల కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తనకు ఆశ్రయం ఇచ్చే తండ్రి నుంచే తీవ్ర లైంగిక వేధింపులకు గురైన బాలిక ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. చిన్న వయసులోనే ఇలాంటి భయంకర అనుభవం తట్టుకోలేక తీవ్రంగా తీవ్రంగా బెంబేలెత్తిపోతుంది. ఆమెకు తగిన సైకాలజికల్ కౌన్సిలింగ్‌ (Psychological counseling) అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

పోక్సో చట్టం అంటే ఏమిటి? (What is the POCSO Act?)

POCSO అంటే Protection of Children from Sexual Offences Act. ఇది 2012లో భారత ప్రభుత్వం చట్టంగా తీసుకొచ్చింది. ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు, చిత్రహింసలు వంటి నేరాలపై కఠినంగా వ్యవహరించడానికి రూపొందించబడింది.

పోక్సో చట్టం ప్రకారం వయసు పరిమితి ఎంత?

పోక్సో చట్టం (POCSO Act) ప్రకారం, 18 సంవత్సరాలు నిండని వ్యక్తిని శిశువు (Child)గా పరిగణిస్తారు.అంటే, పద్దెనిమిదేళ్ళలోపు ఉన్న వారు ఈ చట్టం పరిరక్షణకు అర్హులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TG New villages: కొత్త గ్రామాల కోసం అభ్యర్థనలు పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ శాఖ

Breaking News Devaruppula crime news father abuses daughter Jangaon minor abuse case latest news POCSO Act arrest POCSO case Telangana Telangana child abuse Telangana minor victim

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.