📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Breaking News – Anganwadi Jobs : అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క

Author Icon By Sudheer
Updated: October 29, 2025 • 8:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ సేవలను శక్తివంతం చేయడానికి పెద్ద ఎత్తున నియామకాలకు కసరత్తు మొదలైంది. మొత్తం 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీలను మరింత బలపరిచే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

Breaking News – Rajani Retirement : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) అభ్యర్థులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తివేయేందుకు వెంటనే వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని మంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలను స్థానికులే సమర్థంగా నిర్వహించగలరన్న అభిప్రాయంతో ఈ రిజర్వేషన్ అమలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. తొందరలోనే న్యాయపరమైన సమస్యలను అధిగమించి స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.

అదే సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ నిబంధన వర్తించట్లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల నియామకాలు పారదర్శకంగా జరిగి, సామాజిక న్యాయం సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ చర్యలు అమల్లోకి వస్తే, పల్లెల్లో సేవల నాణ్యత పెరగడంతో పాటు వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

anganwadi Google News in Telugu Latest News in Telugu sithakka

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.