- సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
హుస్నాబాద్ రూరల్: దేశంలో పెట్టుబడిదారులకు మద్దతుగా పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు (Kunamaneni Sambasiva Rao) అన్నారు. బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) సిద్దిపేట జిల్లా నాలుగవ మహా సభలు పట్టణంలోని కెజెఆర్ గార్డెన్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా కెజెఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలో 60శాతం సంపద కేవలం పదిశాతం మంది వద్దనే ఉందని వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించే వాళ్లు బిజెపి దృష్టిలో దేశభక్తులు, సామాన్యుల హక్కుల సాధన కోసం తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిన వాళ్లు దేశద్రోహుల్లా కనబడుతున్నారా అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికలో ఒక్కసీటుతో పొత్తులు ఉండవని స్పష్టం
ఇక రాష్ట్రంలో పొత్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నుండి ఇక పొత్తుల విషయంలో ఒక్కసీటుతో పొత్తులు ఉండవని (no alliances with one seat.) స్పష్టం చేశారు. ఇది కావాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జడ్పిటిసిలుగా తమ పార్టీకి చెందిన కార్యకర్తలే గెలిచి తమ బలమేంటో పాలకులకు చూపించాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చిన నుండి రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందని సామాన్యుల హక్కుల సాధన కోసం తుపాకులు పట్టుకుని అడవుల్లోకి ఉన్న మావోయిస్టులను ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం హత్యలు చేస్తున్నారని మండి పడ్డారు. 2026 వరకు మావోస్టులను అంతం చేస్తామని చెబుతున్న అమిత్, బిజెపి ప్రభుత్వాలు మావోయిస్టులను, కమ్యూనిస్టులను అంతం చేయాలంటే వాళ్ల బాబులు దిగి వచ్చినా సాధ్యం కాదన్నారు. కమ్యూనిజం లేకుంటే మనిషి మనుగడ లేదని స్పష్టం చేశారు. దేశంలో పాలక ప్రభుత్వాలు పెట్టుబడి, పెత్తందారులకు అనుగుణంగా చట్టాలు తయారు చేస్తూ వారిని పెంచి పోశిస్తున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్లు తిండి లేకుండా అడవుల్లో చస్తుంటే దేశ సంపదను రాజకీయ నాయకుల ముసుగులో దోచుకొని జనవాసాల్లో దర్జాగా తిరుగుతున్నా రన్నారు. కేంద్రంలో పాలన సాగిస్తున్న నాయ కులు పాలకులా లేక రాక్షసులా అర్థం కావడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మావోయిస్టులు దేశ ద్రోహులా, వారివల్ల దేశానికి ఏమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే గొంతుకలు తప్ప కుండా ఉంటాయని, ప్రశ్నించే వాళ్లకు సమా దానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదే అన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Elections: పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి