📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

KTR : పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

Author Icon By Sudheer
Updated: July 26, 2025 • 9:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సు (BRSV State Level Conference)లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లిన పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆయన భార్య ఫోన్ ఇవ్వలేదని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు చదివారా? మెదడు ఉందా? అంటూ ఘాటుగా నిలదీశారు. ‘‘అధికారం శాశ్వతం కాదు, మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మీ తీరుపై మిత్తీతో సహా జవాబు చెబుతాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మూసీ కుంభకోణం, గిరిజన భూముల లాగింపు పై ఘాటైన విమర్శలు

కేటీఆర్ మాట్లాడుతూ మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గబ్బేలెక్కారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన పోరాటంతోనే ఆ కుట్రలు ఆగిపోయాయని తెలిపారు. లగచర్లలో రేవంత్ అల్లుడి కంపెనీ కోసం గిరిజన భూములను లాక్కోవాలని కుట్ర పన్నడం హేయమని పేర్కొన్నారు. అలాంటి బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలిచిందని, కంచన్‌గచ్చిబౌలి భూముల విషయంలో విద్యార్థులే ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు.

పోరాటం చేసేవారికే భవిష్యత్ – బీఆర్ఎస్ వేదికగా శిక్షణ

కేటీఆర్ వెల్లడించిన ప్రకారం, బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా విద్యార్థులను శిక్షణ ఇస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి యువతిపై ఉందని, ఉద్యమాలు చేసే వారికే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కలుగుతాయని స్పష్టం చేశారు. ‘‘మనం పోరాడితేనే న్యాయం సాధ్యమవుతుంది’’ అని ఉద్ఘాటించారు. పోలీసులకు రాజకీయం అనుకూలంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలని సూచించారు.

Read Also : BRS Merge with BJP : సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం

Google News in Telugu ktr KTR Warning Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.