KTR warning : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అరెస్ట్ జరిగిందని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం సిగ్గుచేటని అన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన చర్యలకు వడ్డీతో సహా రాజకీయంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.
Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్
క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్‌పై కేసులు పెట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. ప్రజలు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, వారు తమ ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: