KTR Tour Today: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K. T. Rama Rao) గురువారం నాడు ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం సమయంలో భూదాన్ భూముల వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా కల్పించనున్నారు.
Read Also: Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!
సూర్యాపేటలో లాకప్‌డెత్ బాధితుడి పరామర్శ
ఖమ్మం పర్యటన ముగించుకుని కేటీఆర్ సాయంత్రం సూర్యాపేట జిల్లాకు చేరుకుంటారు. ఇటీవల కోదాడలో జరిగిన లాకప్‌డెత్ ఘటనలో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన ఓదార్చనున్నారు.. విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వం నుంచి బాధితులకు అందాల్సిన సాయం మరియు న్యాయపరమైన అంశాలపై ఆయన పార్టీ తరపున హామీ ఇవ్వనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: