KTR: రాహుల్ బంధు’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.1000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతుబంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు.
Read Also: TG High Court: సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!
పదవి కోసమే ‘రాహుల్ బంధు’ పథకం
రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతుబంధును నిలిపివేసి ‘రాహుల్ బంధు’ పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రాహుల్ బంధు పథకం కింద గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. అందుకే కేసీఆర్ ముందే చెప్పారని, ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారని తెలిపారు. రేవంత్ రెడ్డి మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టారని విమర్శించారు.
“నేను రుణమాఫీ చేశానని అనుకుంటున్నా, రైతుబంధు వేశానని అనుకుంటున్నా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారని, అసలు ఆయన ముఖ్యమంత్రేనా అని నిలదీశారు. మరి ముఖ్యమంత్రిగా మీరెందుకు ఉన్నారని ప్రశ్నించారు. రైతుబంధు వేస్తే, రుణమాఫీ ఇస్తే మీకు తెలియకుండా ఉండటమేమిటని అన్నారు. హైదరాబాద్‌లో దోమలు బాగా పెరిగిపోయాయని, కానీ నగరంలో చెత్తను మాత్రం తీయడం లేదని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: