KTR: మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓ ఫిర్యాదు చేరింది. ఎన్నికల ప్రచారంలో మైనర్లను పాల్గొనిపెట్టారని ఆరోపిస్తూ ఓటరు షఫీయుద్దీన్ తన ఫిర్యాదులో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, పిల్లలను ప్రచారంలో ఉపయోగించడం చట్టానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Read also: CM Revanth Reddy:4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం హామీ
KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయండి:
KTR: ఇక కేటీఆర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. “ఓటుకు రూ.5 వేలు తీసుకోండి, కానీ బీఆర్ఎస్‌కే ఓటేయండి” అనే ఆయన వ్యాఖ్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్వయంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఉపఎన్నిక వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: