📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR: దేశానికి జాతీయ భాష అవసరం లేదన్న కేటీఆర్‌

Author Icon By Sharanya
Updated: July 20, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జాతీయ భాష అవసరం ఉందా లేదా? ఈ అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కల్వకుంట్ల తారక రామారావు (KTR) హిందీ భాషా రగడపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జైపూర్‌లో జరిగిన “టాక్ జర్నలిజం 2025” కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, విద్యార్థులతో జరిగిన సంభాషణలో హిందీ భాష (Hindi language)పై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు.

భాష భావవ్యక్తీకరణకు మాత్రమే – జాతీయ గుర్తింపుకాదు

ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ జాతీయ భాష కాదని, భారతదేశంలో అనేక అధికారిక భాషలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

భారతదేశంలో భాషా వైవిధ్యం – ఒకే భాష రుద్దటం అన్యాయం

“ఏ భాష అయినా భావవ్యక్తీకరణకు ఓ సాధనం మాత్రమే. అది ఒక సాంస్కృతిక చిహ్నం. భారత్ లో 20 అధికారిక భాషలు (20 official languages in India), 300 అనధికార భాషలు ఉన్నాయి. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదు. తెలుగు భాషను జాతీయ భాషగా చేయాలని ప్రతిపాదిస్తే మిగతా ప్రాంతాల వారు ఒప్పుకుంటారా? 70-80 ఏళ్ళు దేశం బాగుంటే, మళ్లీ జాతీయ భాష ఎందుకు?” అని ప్రశ్నించారు.

“హిందీకి కోటి రూపాయలు.. మిగిలిన భాషల పరిస్థితి ఏంటి?”

హిందీ భాషకు బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించి, తెలుగు, బెంగాలీ భాషలకు ఎందుకు నిధులు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ప్రజలపై తెలుగును రుద్దనప్పుడు హిందీని తమపై ఎందుకు రుద్దుతున్నారని ఆయన నిలదీశారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ, హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకే వదిలేయాలని, దానిని వారిపై బలవంతంగా రుద్దకూడదని ఆయన అన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: TG Cyber Security Bureau: స్మార్ట్‌ఫోన్ యూజర్స్ కి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక..ఎందుకంటే?

Breaking News Hindi Language Controversy ktr speech KTR Viral Comments latest news National Language Debate Talk Journalism 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.