KTR letter : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో, ఎన్నికల హామీల అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాబోయే 2026–27 బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీల అమలులో చిత్తశుద్ధి చూపకపోతే ప్రజల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటి అమలును విస్మరించిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. గత రెండు బడ్జెట్లలోనూ అవసరమైన నిధులు కేటాయించలేదని పేర్కొంటూ, ఈసారి మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమానికి భారీ కేటాయింపులు చేయాలని కోరారు. ప్రజల ఓపిక నశిస్తోందని, ఇక ఆలస్యం చేయకూడదని సూచించారు.
Read Also: T20WC 2026: ఆసీస్ ఎలిమినేషన్‌పై రికీ పాంటింగ్ ఏమన్నారంటే?
అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు డిక్లరేషన్ల రూపంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. ఈ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి నిలదీస్తామని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: