KTR letter : సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని K. T. Rama Rao తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వస్త్ర శాఖ మంత్రి Giriraj Singh కు లేఖ రాశారు. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదని, తెలంగాణపై ఉద్దేశపూర్వక వివక్షకు నిదర్శనమని కేటీఆర్ లేఖలో ఆరోపించారు.
సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, దాదాపు పదేళ్లుగా ఈ అంశంపై నిరంతరంగా పోరాటం సాగిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. కేంద్ర బృందాలే సిరిసిల్లకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించినప్పటికీ, ఫైళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించారు.
Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం
సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ లాంటిదని (KTR letter) కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 30 వేలకుపైగా పవర్ లూమ్‌లు ఉండగా, వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు క్లస్టర్లు మంజూరు చేసి, సిరిసిల్లను విస్మరించడం ప్రాంతీయ వివక్షకు స్పష్టమైన ఉదాహరణగా ఆయన విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్లస్టర్ కోసం అవసరమైన భూమి, విద్యుత్, నీరు, అనుమతులు అన్నీ ముందుగానే సిద్ధం చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, నిజంగా ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సిరిసిల్లకు మద్దతు ఇవ్వకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ప్రకటించి పదేళ్లుగా జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: