KTR: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు (Kavitha) కోర్టులో ఊరట లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కల్పిత ఆరోపణలతో సృష్టించిన ఈ కేసుల ద్వారా తమ పార్టీని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. చివరకు న్యాయమే గెలిచిందని, త్వరలోనే తమ నేతలపై ఉన్న మిగిలిన అక్రమ కేసులు కూడా వీగిపోతాయని సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కాం అనేది ఒక కట్టుకథ అని, దీనిని అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చడమే కాకుండా, తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చారని కేటీఆర్ విమర్శించారు. “ఈ రోజు కవిత గారికి న్యాయం జరిగింది. ఇదే స్ఫూర్తితో మా నేతలపై బనాయించిన ప్రతి కేసు అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే రుజువవుతుంది” అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Khammam Hydra: మంత్రులు కారు రియల్ఎస్టేట్ బ్రోకర్లు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
న్యాయమే గెలుస్తుందని స్పష్టం
ప్రధాన పార్టీలు చేసే ఆరోపణలకు మీడియా ట్రయల్స్ తోడై తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ విమర్శించారు. “దురదృష్టవశాత్తు ఇదే ‘న్యూ ఇండియా’లో కొత్త ధోరణిగా మారింది. ఇక్కడ ఆధారాలతో పనిలేదు, ఆరోపణలు చేస్తే చాలు. న్యాయ ప్రక్రియ స్థానంలో మీడియా కథనాలు ప్రచారం పొందుతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని, తమపై మోపిన కేసులన్నీ అవాస్తవాలని తేలిపోవడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: