📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: KTR: సరైన సమయంలో కేసీఆర్‌ జనంలోకి వస్తారన్న కేటీఆర్

Author Icon By Sharanya
Updated: September 17, 2025 • 9:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకే బాగా తెలుసని స్పష్టం చేశారు. సరైన సమయంలో ప్రజల మధ్యకి వచ్చి తన పాత్రను పోషిస్తారని తెలిపారు.

రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్

ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పాలనను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు చేశారు కేటీఆర్. “గ్రూప్ 1 పరీక్షల కోసం అభ్యర్థులు సమావేశం పెట్టుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

News telugu

సిరిసిల్ల చేనేతను నాశనం చేశారని విమర్శ

తనపై ఉన్న కోపంతో సిరిసిల్లలో చేనేత కార్మికుల పచ్చిపోటును గాలికి ఉడ్చారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. “చేనేత పరిశ్రమను పూర్తిగా అతలాకుతలం చేశారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి జారిన ఎమ్మెల్యేల పరిస్థితి “కుడితిలో పడిన ఎలుకల్లా” ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలనపై ధీమా ఉంటే వెంటనే ఉపఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అప్పుడే ప్రజలు నిజమైన తీర్పు చెబుతారని అన్నారు.

ఉద్యోగాల కోసం డబ్బులు అడిగారన్న అభ్యర్థులే చెబుతున్నారు

ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి అనుమానాస్పదమని ఆరోపించారు కేటీఆర్. “డబ్బులు అడిగారని అభ్యర్థులే చెబుతున్నారు. కానీ ప్రభుత్వ నేతలు విచారణకు బదులుగా ప్రతిపక్షాలపై దాడికి దిగుతున్నారు” అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడంపై కూడా మండిపడ్డారు. “మంత్రులు కూడా తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అసాధారణం” అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్-బీజేపీ మధ్య అప్రకటిత ఒప్పందం ఉందా?

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య బలమైన అవగాహన ఉందని ఎత్తి చూపారు. “రాష్ట్రంలో బంధుప్రీతి లేదని చెబుతున్నారు. అప్పుడు సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు.

అజారుద్దీన్‌పై సెటైర్లు – “త్రిశంకు స్వర్గంలో ఉన్నారు”

అజారుద్దీన్ విషయాన్ని ప్రస్తావిస్తూ, “కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన ఎమ్మెల్సీ కాలేరు” అని అన్నారు. గతంలో క్రికెట్‌లో కట్‌లు కొట్టే అజారుద్దీన్‌ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్ చేసిందని ఎద్దేవా చేశారు. ఆయన ప్రస్తుతం “త్రిశంకు స్వర్గంలో” ఉన్నారంటూ సెటైర్లు వేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ధీమా

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో ఏడు సర్వేలు నిర్వహించామని, అందులో అన్నింటిలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన మూడు సర్వేలు కూడా అదే ఫలితాన్ని చూపించాయన్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి బంధువుల కోసం దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలో బయటపెడతామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mallanna-suspended-for-anti-party-activities-mahesh-kumar-goud/telangana/549319/

Breaking News brs Group1 JubileeHillsBypoll KCR ktr latest news RevanthReddy TelanganaPolitics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.