📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR: కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయిన కవిత..

Author Icon By Anusha
Updated: August 10, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, ఆప్యాయంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా భావించే ఈ పండుగ రోజు, ప్రతి ఇంట్లో సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి ప్రేమను పంచుకున్నారు. అయితే, ఈ సారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖమైన కేసీఆర్ (KCR) కుటుంబంలో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ లోపలే గోప్యంగా విభేదాలు ఉన్నాయా? అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజున కవిత, కేటీఆర్‌ను కలుస్తారా లేదా అన్న ప్రశ్న అందరిలో ఆసక్తి రేపింది. ఎందుకంటే, ఇంతకు ముందు ప్రతి సంవత్సరం వీరిద్దరూ రాఖీ పండుగను కలసి జరుపుకునే వారు.

బెంగళూరులో ఉన్నానని కేటీఆర్ సందేశం పంపారని

ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టడానికి వస్తానని చెప్పినప్పుడు.. తాను హైదరాబాద్‌లో అందుబాటులో లేనని, బెంగళూరులో ఉన్నానని కేటీఆర్ సందేశం పంపారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ సందేశం అందుకున్న తర్వాత.. కవిత కేటీఆర్‌ (KTR) ను కలవకుండానే రాఖీ పండుగ జరుపుకున్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. రాఖీ పండుగ లాంటి ముఖ్యమైన రోజున కూడా అన్నయ్య అందుబాటులో లేకపోవడంపై కవిత వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా కవిత జైలులో ఉన్నప్పుడు రాఖీ కట్టలేకపోయిన సందర్భంలో కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “జైల్లో ఉన్నందున రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాను” అని అప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు.

KTR:

గతంలో ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు

అయితే ఈసారి ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ.. కేటీఆర్ బెంగళూరులో ఉన్న కారణంగా వారిద్దరూ కలుసుకోలేకపోయారు. ఈ సంఘటన వల్ల వారి మధ్య దూరం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దీనికి ప్రధాన కారణం, పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలను ఎవరు చేపడతారనే అంశంలో ఉన్న పోటీ వంటివి కావచ్చని తెలుస్తోంది. రాఖీ కట్టాలా వద్దా అని గతంలో ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు.. ‘రాజకీయాలు రాజకీయాలే, రాఖీ రాఖీయే’ అని చెప్పిన కవిత, ఈసారి తన సోదరుడు అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ ఘటన బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కేటీఆర్ పూర్తి పేరు ఏమిటి?

కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు.

కేటీఆర్ పూర్వపు పదవులు ఏవి?

కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన, ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nagarjuna-sagar-gates-open-again/telangana/528363/

Breaking News BRS party updates Kavitha KTR relationship KCR family news KTR Bangalore visit KTR Kavitha news latest news Rakhi festival Telangana Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.