📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Chamala Kiran Kumar Reddy : కేటీఆర్ పగటి కలలు కంటున్నారు: చామల కిరణ్

Author Icon By Divya Vani M
Updated: July 26, 2025 • 7:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని కలలు కంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ 200 మందిని వెంటబెట్టుకొని డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ అధికారంలో లేక పదెనిమిది నెలలే అవుతోందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో అనుమానాలు కలిగించేందుకు బీఆర్ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

Chamala Kiran Kumar Reddy : కేటీఆర్ పగటి కలలు కంటున్నారు: చామల కిరణ్

వ్యతిరేక ప్రచారంపై అసహనం

రేవంత్ రెడ్డిపై చేస్తున్న ప్రచారం విఫలమవడంతో కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఏదో చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని, కానీ పదేళ్ల పాలనలో చేసినది ఏమిటని ప్రశ్నించారు.కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన 70 హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కుటుంబ సభ్యుల ఫోన్లను కేటీఆర్ తప్ప ఎవరూ ట్యాప్ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా బీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి ఎక్కువ చేస్తూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా బీఆర్ఎస్ నేతలు పాపులారిటీ సంపాదించాలనుకుంటున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Read Also : Chirag Paswan : నితీశ్ పాలనపై చిరాగ్ పాశ్వాన్ ఘాటు విమర్శలు

BRS campaign on Revanth Reddy's rule Chamala Kiran Kumar Reddy's comments Chamala Kiran's media conference Congress attack on KTR Congress criticism on BRS KCR's political future KTR's daydreams Telangana Political News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.