📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kodangal News: కేటీఆర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన కొడంగల్ మహిళ

Author Icon By Saritha
Updated: November 3, 2026 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kodangal News: ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ మహిళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K. T. Rama Rao) చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. మస్కట్‌లో చిక్కుకున్న బాధితురాలిని సొంత ఊరికి రప్పించడంతో ఆమె కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది.

Read Also : CM Revanth Reddy: చెత్త సేకరణపై రేవంత్ రెడ్డి హెచ్చరిక

Woman from Kodangal returns home safely, thanks to KTR’s initiative

Kodangal News: కొడంగల్ మహిళ దయనీయ స్థితి: కేటీఆర్‌కు కుమారుడి విజ్ఞప్తి

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధి కోసం మస్కట్ వెళ్ళింది. అయితే అక్కడ ఏజెంట్లు మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మస్కట్‌లో తన తల్లి పడుతున్న నరకయాతనను చూడలేక, ఆమె కుమారుడు రాజు సెప్టెంబర్ 29న బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను కలిసి తన తల్లి పరిస్థితిని వివరించాడు. ఆమెను ఎలాగైనా కాపాడాలని వేడుకున్నాడు.

ఎంబసీతో సంప్రదింపులు.. తెలంగాణ భవన్‌లో కృతజ్ఞతలు!

రాజు విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, సమస్యను త్వరలోనే పరిష్కరించి ఆమెను సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తానని కుటుంబ సభ్యులకు కొండంత భరోసా ఇచ్చారు. ఆ మాట ప్రకారమే భారత ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, న్యాయపరమైన చిక్కులను తొలగించి లక్ష్మిని సురక్షితంగా తిరిగి భారత్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ చేరుకున్న లక్ష్మి, తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ‘తెలంగాణ భవన్’లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమను కష్టకాలంలో ఆదుకుని, ప్రాణాలతో స్వదేశానికి రప్పించినందుకు లక్ష్మి కేటీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

BRS News Kodangal News KT Rama Rao KTR Helps Muscat Trapped Woman Latest News in Telugu Muscat Indian Embassy Telangana Bhavan Hyderabad Telangana Gulf Workers Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.