📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: KTR: గ్రూప్-1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలి : కెటిఆర్

Author Icon By Sharanya
Updated: September 12, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్(KTR) డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్-1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్-1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణలపైన కెటిఆర్ ఒక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని తీవ్రంగా విమర్శించారు.

గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలి

హైకోర్టు ఆదేశించినట్టుగా గ్రూప్-1 పరీక్ష (Group-1 Exam)ను మళ్లీ తాజాగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా డిమాండ్ చేశారు. అలాగే, పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఒక జుడీషియల్ కమిషన్ వేసి, ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది నిరుద్యోగుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కాసుల కక్కుర్తి కలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయని కెటిఆర్ మండిపడ్డారు. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఒక వ్యాపారంగా మార్చిందని ఆరోపించారు. అందుకే కోట్లాది రూపాయలను తీసుకొని పోస్టులను అమ్ముకుందని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అవ్వడం వల్ల యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఈ వైఫల్యాన్ని వారు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని సూచించారు.

కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు?

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల నియామకాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై స్పందించిన కెటీఆర్, ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి న్యాయపరమైన నిష్పక్షపాత విచారణ జరపాలని సూచించారు. ఆరోపణలు తీవ్రతరంగా ఉన్నందున జ్యుడీషియల్ కమిషన్ అవసరం అని అన్నారు.

జ్యుడీషియల్ కమిషన్ అంటే ఏమిటి? దాని పాత్ర ఏమిటి?

జ్యుడీషియల్ కమిషన్ అనేది న్యాయమూర్తుల ఆధ్వర్యంలో జరిగే స్వతంత్ర విచారణ కమిటీ. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ప్రజలకు సంబంధించి జరిగిన అన్యాయాలపై విచారణ చేసి నివేదిక అందిస్తుంది. ఇది నిష్పక్షపాతంగా ఉంటుంది

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/hyderabad-telangana-north-east-connect-festival-from-november-20-in-hyderabad/telangana/545722/

Breaking News Group1Scam JobsScam JudicialCommission ktr latest news PoliticalNews TelanganaPolitics Telugu News TSPSC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.