📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: KTR: ప్రైవేటుల లాభానికే ఫార్ములా–ఈ కుట్ర: ఏసీబీ సంచలనం

Author Icon By Pooja
Updated: November 21, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా–ఈ రేసు వ్యవహారం మాజీ మంత్రి కేటీఆర్(KTR) చుట్టూ ముంచుకొస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణలో తెలుస్తోంది. ఈ ఈవెంట్ నిర్వహణలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ నివేదికలో పేర్కొంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ రేసును జరిపారని, ప్రజా ధనం భారీగా వ్యర్థమైందని, ఈ ప్రక్రియ మొత్తం అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Read Also: CM Revanth Reddy: హైదరాబాద్‌లో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’

Formula for private profit – this conspiracy: ACB sensational

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేసును నిర్వహించాలని ప్రభుత్వ స్థాయిలో ఏ ప్రతిపాదన రాలేదు. 2021 నవంబర్‌లో ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన చర్చలే ఈ మొత్తం వ్యవహారానికి ఆరంభమని పేర్కొంది. ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి అంతర్జాతీయ క్రీడల కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావు అని నిర్ధారించింది.

టీ–హబ్ ప్రెజెంటేషన్ నుంచి రేసు ఏర్పాట్ల వరకు

ఫార్ములా–ఈ రేసును భారత్‌కు తీసుకురావాలన్న ఆలోచనతో గువ్వాడ కృష్ణారావు, తన పాత మిత్రుడు దిల్‌బాఘ్ గిల్‌తో కలిసి 2021 నవంబర్ 18న టీ–హబ్‌లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక సహకారం కోసం గ్రీన్‌కో వ్యవస్థాపకుడు చెలమలశెట్టి సునీల్‌ను సంప్రదించారు. తరువాత జరిగిన మరో సమావేశానికి కేటీఆర్, పలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ వివరాలు పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేటు వర్గాల నుంచే రేసు ప్రతిపాదన వచ్చినట్లు స్పష్టమైంది.

అనుమతి లేకుండానే ఒప్పందాలు

సునీల్‌తో జరిగిన చర్చల తర్వాత కేటీఆర్(KTR) ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే రేసు నిర్వహణకు ముందడుగు వేసినట్లు ఏసీబీ నివేదిక పేర్కొంది. 2022 జనవరి 17న, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లాంగోతో పాటు అర్వింద్‌కుమార్, సునీల్ కలిసి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకాలు చేశారు. అయితే అర్వింద్‌కుమార్‌కు ఇందుకు ప్రభుత్వం నుంచి అధికారాలు లేవని ఏసీబీ గుర్తించింది. ఈ రేసు కోసం సునీల్ Ace Next Gen Pvt Ltd పేరుతో కొత్త కంపెనీని స్థాపించారు. వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కృష్ణారావుకు సంవత్సరానికి రూ. 1.9 కోట్లు వేతనంగా ఇచ్చే ఒప్పందం కుదిరింది.

అన్నీ కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని, అన్ని నిబంధనలను విరుద్ధంగా ఉల్లంఘించి రేసు నిర్వహణ ఒప్పందాలు కుదిరాయని ఏసీబీ స్పష్టం చేసింది. ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ACBInvestigation Google News in Telugu KTRCase Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.