📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

KTR :కుటుంబంలో భేదాభిప్రాయాలు సహజమే!

Author Icon By Radha
Updated: January 6, 2026 • 9:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుటుంబం అంటే సమస్యలు, అభిప్రాయ భేదాలు సహజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. చిన్నచిన్న మనస్పర్థలు లేకపోతే అది నిజమైన కుటుంబమే కాదని ఆయన అన్నారు. ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటేనే సాయంత్రం వంట విషయంలో కూడా వేర్వేరు అభిప్రాయాలు వస్తాయని, అలాంటివి సాధారణ విషయాలేనని చెప్పారు.

Read also: CM Revanth : కెసిఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది – కేటీఆర్

కుటుంబంలో చిన్నపాటి పంచాయితీలు జరుగుతూనే ఉంటాయని, కానీ అవన్నీ ఇంటి గడప దాటకుండా లోపలే పరిష్కరించుకుని, తర్వాత మళ్లీ ఐక్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలకూ వర్తింపజేయాలన్నారు. జనగామ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఒక్కరికే పోటీ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ ఖరారయ్యే వరకు మాత్రమే అసంతృప్తులు ఉండవచ్చని, కానీ బీఫామ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందని, టికెట్ ఇచ్చిన తర్వాత కూడా అంతర్గత అసంతృప్తులు కొనసాగితే కాంగ్రెస్, బీజేపీలకు పార్టీని విమర్శించే అవకాశం కల్పించినట్టవుతుందని కేటీఆర్(KTR) హెచ్చరించారు. పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బీఫామ్ కేటాయిస్తుందని, ఎవరికి టికెట్ వచ్చినా కారు గుర్తుపై ఉన్న అభ్యర్థిని కేసీఆర్‌గా భావించి ఓటు వేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఇటీవల కవిత పార్టీపై విమర్శలు చేస్తూ కొత్త పార్టీ ఏర్పాటు గురించి వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Google News in Telugu Latest News in Telugu PartyDiscipline TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.