📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

KTR: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

Author Icon By Tejaswini Y
Updated: January 20, 2026 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ చేనేతలపై కేంద్రానికి కెటిఆర్ లేఖ

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర ఆరోపణ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణపై ఉద్దేశపూర్వక వివక్షేనని లేఖలో ఆయన ఆరోపించారు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, దీనిపై పదేళ్లుగా నిరంతరం పోరాడుతున్నామని గుర్తు చేశారు.

Renu Desai : మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

KTR: Delay in sanctioning Sircilla Mega Power Loom Cluster

30 వేలకుపైగా పవర్ లూమ్స్‌తో వేలాది కుటుంబాల జీవనాధారం

కేంద్ర బృందాలే అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించినా ఫైళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ లాంటిదని, ఈ ప్రాంతం 30 వేలకు పైగా పవర్ లూమ్స్ తో వేలాది కుటుంబాల జీవనాధారమని కేటీఆర్ తెలిపారు. తక్కువ సామర్థం ఉన్న ప్రాంతాలకు క్లస్టర్లు ఇచ్చి, సిరిసిల్లను విస్మరించడం ప్రాంతీయ వివక్షకు నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన భూమి, విద్యుత్, నీరు, అనుమతులు అన్నీ సిద్ధం చేసిందని గుర్తుచేశారు. “మేక్ ఇన్ ఇండియా(Make in India) అంటూ నినాదాలు ఇచ్చే కేంద్రం, నిజంగా సామర్థం ఉన్న సిరిసిల్లకు మద్దతు ఇవ్వకపోవడం ద్వంద్వ నీతేనన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ను ప్రకటించి పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బతిమిలాడాం. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర కేంద్రం వివక్షకేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు.

సిరిసిల్లకు వెంటనే క్లస్టర్ మంజూరు చేయాలి

సీపీసీడీఎస్ నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి? అని ప్రశ్నించారు.
తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత క? అని ప్రశ్నించారు. ఇది కేవలం నిరక్ష స్టెర్లి కాదు. తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయలాంటిదని పేర్కొన్నారు. సిరిసిల్ల లో 30 వేలకు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సిరిసిల్ల కంటే తక్కువ సామర్థం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం. అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు.

ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదేపదే చెబుతున్నా, ఎటువంటి సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టడం సిగ్గుచేటు అని ఎండగట్టారు. ఒకవైపు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, తెలంగాణ విషయంలో ద్వంద నీతికి, చిత్తశుద్ధిలేమికి అద్దంపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. కానీ నేడు పరిస్థితులు మారుతున్నాయి. ఇటువంటి కీలక సమయంలో కేంద్రం జోక్యం చేసుకుని మెగా క్లస్టర్ ను మంజూరు చేయాల్సి ఉండగా, తీవ్రమైన జాప్యం చేయడం నేతన్నల పొట్ట కొట్టడమే అవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS party ktr KTR Letter to Centre Mega Power Loom Cluster Siricilla Power Looms Telangana Handloom Industry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.